A Film by సుచరిత


Sat,November 15, 2014 02:05 AM

ఎప్పుడొచ్చామన్నది కాదక్కా... బుల్లెట్ దిగిందా లేదా ?ఇదేంది డైలాగ్ మార్చి రాశారు అనుకుంటున్నారేమో ఇది ఛోకిరి మూవీలోని డైలాగ్! ఛోకిరియా? అని డౌటొచ్చిందా ? ఆ డౌట్‌ని కొద్దిసేపు పక్కకి పెట్టి యూట్యూబ్‌లో సుచరిత మూవీస్ అని టైప్ చేయండి. అందులో మీకు పోకిరి సినిమాలోని మహేశ్‌బాబు క్యారెక్టర్, డైలాగులు, యాక్షన్ అన్నీ పేరడీగా తీసిన ఓ సినిమా కనిపిస్తుంది. అందులో హీరో క్యారెక్టర్‌లో ఓ అమ్మాయి కనిపిస్తుంది. ఆమెనే సుచరిత. యాక్టింగ్ రానివారి కోసం ఓ ఇనిస్టిట్యూట్, యాక్టింగ్ వచ్చి అవకాశాలు దొరకని వారి కోసం ఓ ట్రస్ట్.. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి తనవంతు సేవ చేస్తున్న సుచరిత రామానుజాపురం పరిచయం మీకోసం.

వరంగల్ జిల్లా ఖిల్లాషాపూర్‌కి చెందిన సుచరిత చిన్నతనంలోనే బాపూ డైరెక్షన్‌లో వచ్చిన శ్రీభాగవతం సీరియల్‌లో నటించి అందరి మెప్పు పొందింది. ఆ తర్వాత వరుస అవకాశాలను దక్కించుకుని డాన్స్, స్టంట్స్, యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చింది. కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్ళలో పార్టిసిపేట్ చేసి మెప్పు పొందింది.

passion

దూరదర్శన్‌లో తరిగొండ వెంగమాంబ అనే టెలీఫిల్మ్‌లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత రాములమ్మ లొల్లి, పోకిరికి స్పూఫ్‌గా ఛోకిరి వంటి ఫీచర్ సినిమాలు తీసి తన టాలెంట్‌ని నిరూపించుకుంది. రాష్ట్ర సాధన కోసం ఆత్మత్యాగాలు చేసుకుంటున్న యువతను ఆలోచింపచేసే క్రమంలో జై తెలంగాణ షార్ట్ ఫిలిమ్ ద్వారా ఆలోచింపచేసింది. నిజాం కాలేజీలో ఓపెన్ డిగ్రీ చదువుతున్నప్పుడు ఎగ్జామ్స్‌ని బాయ్‌కాట్ చేసింది. వారం రోజుల పాటు హంగర్ ైస్ట్రెక్‌లో పాల్గొంది. చిన్నప్పుడు స్కూల్‌కే వెళ్లని సుచరిత ప్రస్తుతం థియేటర్ ఆర్ట్స్‌లో పి.హెచ్.డి చేస్తోంది. సమాజంలో మహిళకు నిర్దేశింపబడిన హద్దులను ప్రస్తావిస్తూ పంజరంలో చిలక అనే షార్ట్ ఫిలింతో మహిళా లోకాన్ని ఉత్తేజపరిచింది. మరోవైపు సికింద్రాబాద్‌లో సుచరిత ఫిలిం ఇనిస్టిట్యూట్ అనే ఫిలింస్కూల్ పెట్టి సినిమా రంగం పట్ల ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహిస్తోంది.

దీంతోపాటుగా ఏవీ ఫిలిం ట్రస్ట్ ద్వారా సినిమాల్లో అవకాశాలు దొరకని వారికి సైతం తోడ్పాటునందిస్తోంది. రామ్‌గోపాల్ వర్మ తీసిన కౌన్ అనే హర్రర్ మూవీని రిమేక్ చేసి వర్మ కంటే ఎక్కువ భయపెట్టి ఔరా అనిపించుకుంది. ఈ ట్రైలర్ ద్వారా రైల్వేగేట్ సినిమాలో అవకాశం వచ్చింది. జానీ, భద్రాచలం, మనసారా వంటి సినిమాలకు ఫైట్ మాస్టర్ గా చేసిన తైక్వాండో మాస్టర్ వెంకటేశం దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని కామెడీ కిక్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. మనిషి జీవితానికి కళాకారుడే ఇంజినీర్ అనే ట్యాగ్‌లైన్‌తో ఏవీ ఫిలిం ట్రస్ట్‌లో అనాథాశ్రమాల్లో ఉండే పిల్లలకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహిస్తోంది. తండ్రి పెట్టిన విశ్వకర్మ చారిటబుల్ ట్రస్ట్‌తో పాటు పలు సంస్థల తరపున సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నది.

దృశ్యం ద్వారా సమస్యను అందరికీ అర్థమయ్యేలా వివరిస్తే దాని ద్వారా కొంతైనా పరిష్కార మార్గం దొరుకుతుందనే కాన్సెప్ట్‌తో ఈ రంగంలోకి వచ్చాను. నాకు నాన్న ఎంతో సపోర్ట్ చేశారు. నా తొలి విమర్శకుడు, ప్రోత్సాహకుడు నాన్నే. నేను తీసే సినిమాలకు ముందుగా టికెట్ తీసుకోవాల్సిన పని లేదు. చూసిన తర్వాత బయట పెట్టే బాక్స్‌లో వేస్తే చాలు. మా ఇనిస్టిట్యూట్‌లో ఉండే అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్‌ని వేరేవాళ్లకి అద్దెకి ఇస్తాం. దానిద్వారా, ఇనిస్టిట్యూట్ ఫీజుల ద్వారా వచ్చిన డబ్బులతో మా ట్రస్ట్ నడుస్తోంది.

- సుచరిత

2010
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles