90 రోజులు దాటిన సిమెంట్ వద్దు..


Sat,March 9, 2019 12:11 AM

నిర్మాణ రంగంలో సిమెంట్‌ది కీలక పాత్ర. ధరలు తక్కువగా ఉన్నపుడు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అయితే కలల ఇంటిని నచ్చినట్లుగా నిర్మించుకునేందుకు ఎలాంటి సిమెంట్‌ని వాడాలి అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. సిమెంట్ ఎంపిక, వాడకం గురించి కొన్ని కొన్ని కీలకమైన అంశాలు తెలుసుకుంటే.. మన కలల గృహం కలకాలం పటిష్ఠంగా ఉంటుంది.

cement
-90 రోజుల కంటే ఎక్కువ కాలం నిల్వ ఉన్న సిమెంట్‌ను వినియోగించకూడదు. అందుకే సిమెంట్ కొనే ముందు తయారైన రోజు, నెల, ఏడాది గురించి బ్యాగ్‌పై చూసుకోవాలి.
-సిమెంట్ గడ్డలుగా ఉంటే కొనుగోలు చేయకూడదు. అలా ఉందంటే అందులో తేమ చేరిందని అర్థం.
-సిమెంట్ సున్నితంగా ఉండాలి. రెండు వేళ్లతో పట్టుకుంటే మృదువుగా ఉండాలనే విషయం గుర్తుంచుకోండి.
-సిమెంట్ రంగు బూడిద రంగులో ఉండాలనేది బండ గుర్తు.
-నీటిపై సిమెంట్‌ని చల్లితే నీటిపై తేలుతూ కనిపించాలని మర్చిపోవద్దు.

మోడీ సూచన వింటారా?
భారత దేశంలో నిరుపేదలు 2022 నాటికల్లా సొంతింట్లో నివసించాలని.. ఈ లక్ష్యానికి ప్రభుత్వం చేరుకునేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చి సాయం చేయాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకూ నిర్మాణ పరిజ్ఞాన సంవత్సరంగా పరిగణిస్తామని ప్రకటించారు. అందుబాటు గృహాల్ని నిర్మించాలన్న మోడీ సూచనను ఎంతమంది వింటారో..!

210
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles