72 యేండ్ల చాంపియన్!


Thu,February 7, 2019 01:34 AM

అద్భుతాలు ఎవరు చేసినా విశేషమే. అయితే యువకులు చేస్తే కాస్త గొప్ప అనిపించవచ్చు. అదే వృద్ధులు చేస్తే గొప్పే కాదు మరింత విశేషం కూడా. ఏడుపదుల వయసులో హరే రామహరేకృష్ణ అనుకుంటూ కూర్చోలేదు ఆయన. వయసు మళ్లినా ఏదైనా సాధించి నిరూపించాలనే తపనే ఆయన్ను గెలిపిస్తున్నది. ఏమాత్రం అలుపు, సొలుపు లేకుండా పలు క్రీడల్లో రాణిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు 72యేండ్ల అభిమన్య. లేటు వయసులోనూ తన సత్తా చూపిస్తూ వాట్ ఏ వండర్ అనిపిస్తున్నాడు. ఈత, బాస్కెట్‌బాల్
క్రీడల్లో చాంపియన్‌గా రాణిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు.

Champian
సాధించాలనే పట్టుదల, తపన ఉంటే ఎంతటి విజయాన్నైనా అవలీలగా సాధించవచ్చు. అందుకు లింగ భేదం, వయోభేదం కూడా అడ్డు రాదు. ఏదైనా సాధించాలంటే యువకునిగా ఉన్నప్పుడే అనుకుంటారు కొంతమంది. వ యసు మళ్లిన తర్వాత ఏం చేయాలన్నా కష్టం అంటుంటారు మరికొందరు. ఇలా నిరాశ, నిస్పృహలతో డీలా పడిపోతుంటారు. అలాంటి వారికి, నేటితరం యువతకు సై తం చాలెంజ్ విసురుతున్నాడు 72యేండ్ల అభిమన్య. ఏ డు పదుల వయసులో ఘన విజయాలు సాధిస్తున్నాడు.

ఉద్యోగం చేస్తూనే..

హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్‌కు చెందిన అభిమన్య దక్షిణమధ్య రైల్వేలో ఉద్యోగం చేశాడు. లాలాగూడలోని రైల్వే వర్క్‌షాప్ మెకానికల్ విభాగంలో 1964నుంచి విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యాడు. అభిమన్యకు చిన్నప్పటి నుంచీ ఆటలంటే చాలా ఇష్టం. ఎప్పుడు వీలు దొరికినా ఏదో ఒక ఆట ఆడుతూనే ఉంటాడు. శరీరానికి ఏ మాత్రం విశ్రాంతి ఇచ్చేవాడు కాదు. ఇదే పద్ధతిని నేటి వరకూ కొనసాగిస్తున్నాడు అభిమన్య. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు బాస్కెట్‌బాల్, ఈత పోటీల్లో పాల్గొనేవాడు. ఇలా జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో పాల్గొని ఎన్నో పతకాలు సాధించాడు కూడా.

ప్రతి ఈవెంట్‌లోనూ పతకమే..

ఓ వైపు వృత్తిలో రాణిస్తూనే.....తాను చేరాలనుకున్న లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తూ తానేంటో ప్రపంచానికి తెలిసేలా చేశాడు. తన పట్టుదలకు కుటుంబసభ్యుల ప్రోత్సాహం లభించడంతో వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా ఏడు పదుల వయసులోనూ వెనుకాడడం లేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈత పోటీల్లో విశేష ప్రతిభ చూపుతూ వందల పతకాలను సాధించాడు. రెండేళ్ల క్రితం కర్ణాటకలో జరిగిన స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 14వ నేషనల్ మాస్టర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో 70-74 ఏళ్ల వయస్సు విభాగంలో పాల్గొని బ్రీస్ట్ స్ట్రోక్, ప్రీ ైస్టెల్ పోటీల్లో రెండవ స్థానంలో నిలిచి రెండు రజత పతకాల్ని సాధించాడు. కర్ణాటక పోలీసు కమిషనర్ చేతుల మీదుగా రజత పతకాలు అందుకొన్నాడు. 2017లో జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో నాలుగు విభాగాల్లో పాల్గొని మూడు బంగారు, ఒక రజత పతకాన్ని సాధించాడు. రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూనే సిమ్మింగ్, బాస్కెట్‌బాల్ పోటీల్లో పతకాలు సాధించాడు.

కోచ్‌గా కొత్త అవతారం..

అభిమన్య ఉద్యోగ విరమణ అనంతరం తనలా మరి కొంతమందిని తయారు చేయాలనుకున్నాడు. ఇందుకు ఓ ప్రైవేటు పాఠశాలలో బాస్కెట్‌బాల్ కోచ్‌గా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు. అభిమన్య దగ్గర శిక్షణ పొందిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలలో విజయ దుందుభి మోగిస్తున్నాడు. బాస్కెట్ బాల్ కోచ్‌గానే కాకుండా స్విమ్మింగ్‌లో అవసరమైన మెళకువలు నేర్పిస్తున్నాడు. తెలంగాణ వెటరన్ స్విమ్మింగ్ అసోసియేషన్ తరపున పలు పోటీల్లో పాల్గొని అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నాడు.

ఇవీ అభిమన్య విజయాలు..

-2014 నుంచి 2017 వరకు సికింద్రాబాద్‌లో జరిగిన తెలంగాణ మాస్టర్స్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో వరుసగా మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించాడు.
-2017లో సికింద్రాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ఫ్రీైస్టెల్, బ్రీస్ట్ స్ట్రోక్ పోటీల్లో మూడు బంగారు, రెండు రజత పతకాలు సొంతం చేసుకున్నాడు.
-స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 14వ నేషనల్ మాస్టర్స్ ఆక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో అండర్ 70-74 విభాగంలో 100 మీటర్లు, 50 మీటర్ల దూరం పోటీలలో రెండవ స్థానంలో నిలిచాడు.
-ఇటీవల అమెరికాలో జరిగిన సౌత్ కరోలినా స్విమ్మింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో చాంపియన్‌గా నిలిచాడు.
-తెలంగాణ రాష్ట్ర మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో గత 30 సంవత్సరాలుగా రాణిస్తున్నాడు.
Champian1

కొత్తవారిని ప్రోత్సహించాలి..

కొత్త వారికి తర్ఫీదు ఇచ్చి ప్రోత్సహిస్తే మరిన్ని అవార్డులు తెచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకు నేను కూడా నా వంతు పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నా. బాస్కెట్ బాల్, స్మిమ్మింగ్ పోటీల్లో యువ చాంపియన్లను తయారు చేస్తున్నా. అన్ని క్రీడల్లోనూ యువత చురుగ్గా పాల్గొనాలి. దేశానికి పతకాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇందుకు ఆయా క్రీడల సంఘాలు కొత్త వారిని ప్రోత్సహించాలి.
- అభిమన్య, వెటరన్ క్రీడాకారుడు

-కె.శ్రీనివాస్
-ముషీరాబాద్

480
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles