41రకాలుగా ఆత్మరక్షణ!


Mon,December 17, 2018 01:39 AM

కేరళలోని కన్ఘజా పంచాయతీ ప్రాంతంలో 10,308మంది మహిళలు ఉన్నారు. అందులో 7,350మంది మహిళలు ఆత్మరక్షణలో నిష్ణాతులయ్యారు. 41 రకాలుగా వాళ్లని వాళ్లు కాపాడుకోగలరు. అదెలా సాధ్యమైంది?
self-defense
రాత్రి తొమ్మిదయిందంటే.. ఆడవాళ్లు వీధుల్లో తిరుగాలంటేనే భయపడుతున్నారు. అది ఏ ప్రాంతమైనా.. ఏ దేశమైనా! ప్రతీ కామంధుడి కండ్లు చిన్న, పెద్ద తేడా లేకుండా ఆడవాళ్ల మీదే ఉంటాయి. అందుకే వారి చేష్టలను తిప్పి కొట్టాలంటే ఆత్మరక్షణలో ఆడవాళ్లు నిష్ణాతులు కావాలి. కేరళలోని కన్ఘజా అనే గ్రామంలో 2017లో పోలీస్ డిపార్ట్‌మెంట్ నిర్భయ స్కీమ్ పేరు మీద సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్‌లు చెప్పించారు. అలా ఐదుగురు మాస్టర్ ట్రైనర్స్‌గా మారారు. స్కూల్స్, కాలేజ్‌లు, చర్చీలు.. ఇలా 5 యేండ్ల వయసు నుంచి 60 యేండ్ల ముసలి వాళ్ల వరకు ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చారు. ఎన్ని రోజుల్లోనైనా మొత్తం 21 గంటల పాటు ఈ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్న వాళ్లను మాస్టర్స్‌గా మారారు. వీళ్లు మరొక బ్యాచ్‌కి నేర్పిస్తారు. అలా ఇప్పటిదాకా మొత్తం 7, 350మంది శిక్షణ పొందారు. వీళ్లను 41 రకాలుగా అటాక్ చేసినా ఎలా తప్పించుకోవచ్చు, ఎలా రక్షించుకోవచ్చన్నది తెలుసు. అలా అని ఇదేం మార్షల్ ఆర్ట్ క్లాస్ అనుకునేరు. కేవలం చిన్న చిన్న ట్రిక్‌ల ద్వారా ఎలా రక్షించుకోవడం మాత్రమే నేర్పించారు. దీనివల్ల ఏ సమయంలోనైనా ఆడపిల్లలు రోడ్ల మీద తిరుగగలరనే నమ్మకం ఏర్పడిందంటున్నది అక్కడి పోలీస్ డిపార్ట్‌మెంట్. గవర్నమెంట్ కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి ఎంతో సహకరించింది. ఇలాంటి కార్యక్రమాలను మిగిలిన ప్రాంతాల్లో కూడా మొదలుపెట్టే ఆలోచనలో ఉందీ కేరళ ప్రభుత్వం.

505
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles