380 వంటకాల సూపర్‌మామ్!


Sun,March 24, 2019 01:04 AM

నిండు గర్భిణీ. ప్రసవానికి కొన్ని రోజులే ఉన్నాయి. ముగ్గురు పిల్లలున్న ఆమెకు ప్రసవం తర్వాత వంట ఎవరు చేసిపెడతారు. ఇతరులని ఇబ్బంది పెట్టడం ఎందుకనిపించింది కాబోలు. ప్రసవం తర్వాత ఆహారానికి లోటులేకుండా 380 రకాల వంటకాలు తయారు చేసి ఔరా అనిపించింది.
super-mom
మహిళలు గర్భం దాల్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వంట చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. బిడ్డను ప్రసవించిన తర్వాత కూడా కొన్ని నెలలు కష్టతరంగా ఉంటుంది. ఇందుకు వారు ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితే ఆమెకు ఎదురవుతుందని ముందుగానే భావించింది. 37 వారాల గర్భిణీగా ఉన్న జెస్సికా మే మాగిల్ ప్రసవానికి కొద్దిరోజుల ముందే 380 రకాల వంటకాలను సిద్ధం చేసుకున్నది. వాటిలో 152 రకాలు మీల్స్, 228 రకాల స్నాక్స్ ఉన్నాయి. ఇలా చేయడానికి కారణం ఉందంటుంది జెస్సికా. ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాలుగోసారి గర్భం దాల్చించి. ప్రసవం తర్వాత ఆ పిల్లలకు ఆహారంలో లోటు ఉండకూడదని భావించింది. వారితో పాటు ప్రసవం తర్వాత ఆమెకు అవసరమైన ఆహారాన్ని కూడా ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని నిర్ణయించుకున్నది. ఈ సందర్భంగా అవసరమైన సామాన్లను సిద్ధం చేసుకొని వంటలు చేస్తూనే ఉన్నది. అలా 380 రకాలు సిద్ధం చేసినది. ఎన్ని రోజలు నిల్వ ఉంచినా పాడవకుండా ఉండేలా వాటిని తయారుచేసి ప్యాక్ చేయడం గమనార్హం. ఈ వంటకాలన్నీ పోషకాహారాలే. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మొదట భయపడ్డా ఆమె సాహసానికి మెచ్చుకోక తప్పలేదు. ఇరుగుపొరుగు వారయితే సూపర్‌మామ్ అంటూ పొగిడేస్తున్నారు.

300
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles