బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేష్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘రాక్షసుడు’ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. తాజాగా ఈ చిత్రానికి ‘రాక్షసుడు-2’ పేరుతో సీక్వెల్ తెరకెక్కనున్నది. ఈ సీక్వెల్‌కు రమేష్‌వర్మ దర్శకత్వం వహించబోతున్నారు. ‘హోల్డ్ యువర్ బ్రీత్’ ఉపశీర్షిక. హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ పోస్టర్‌ను మంగళవారం చిత్రబృందం విడుదల చేసింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న థ్రిల్లర్ చిత్రమిది. తొలి భాగానికి మించి ఉత్కంఠను పంచుతుంది. అగ్ర కథానాయకుడు ఈ సినిమాలో నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, సాగర్, సంగీతం: జిబ్రాన్, ఛాయాగ్రహణం: వెంకట్ సి దిలీప్.