‘గృహ’ లక్ష్మి!

ఆమె తాపీ ఆడిస్తే పని చకచకా జరగాల్సిందే. మగవాళ్లతో సమానంగా గోడలు కడుతుంది, పురుషుల కంటే వేగంగా ప్లాస్టింగ్ పనులు చేస్తుంది. ‘ఇదంతా నా భర్త దగ్గరే నేర్చుకున్నా. పని మీద పట్టు దొరకడంతో సుమారు 50 ఇండ్లు కట్టాం’ అని గర్వంగా చెబుతున్నది జనగామ జిల్లా దేవరుప్పుల మండల కడవెండికి చెందిన తాపీమేస్త్రీ బాషిపాక లక్ష్మి. బాషిపాక మల్లేశ్- లక్ష్మి దంపతులు 20 ఏండ్ల క్రితం బతుకుదెరువు కోసం ముంబయి వెళ్లారు. అక్కడ ఓ మేస్త్రీ కింద భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసి, తాపీ పని మీద పట్టు సాధించారు. మూడేండ్ల క్రితం వెనక్కి వచ్చేశారు. లక్ష్మి ఉత్సాహాన్ని గమనించిన మల్లేశ్ తాపీపనిలోని కిటుకులు నేర్పించాడు. దీంతో, ఇద్దరూ కలిసి గ్రామంలోనే 50 ఇండ్లవరకూ కట్టారు. వీరి కుమారుడు ప్రభాస్ పదో తరగతి చదువుతున్నాడు. సెలవుదినాల్లో తనూ తాపీ పనులు చేస్తాడు. బిల్డింగులపై డిజైన్లు తీయడంలో దిట్ట.
చేతినిండా పని: ‘ఇద్దరం తాపీ పనులు చేయడంతో చేతినిండా ఉపాధి దొరుకుతున్నది. గుత్త పనులు కావడంతో ఉదయమే పోయి రాత్రివరకు చేస్తాం. తాపీ పని మొదట్లో కొంత కష్టమనిపించినా రానురాను సులువుగా మారింది. మగవారితో సమానంగా చేస్తా’ అంటున్నది లక్ష్మి.
-ఈటూరి విజయ్ కుమార్
తాజావార్తలు
- దేశవ్యాప్తంగా 10వేల కంపెనీల మూత.. ఎందుకంటే?!
- చికిత్స పొందుతూ యాసిడ్ దాడి బాధితురాలు మృతి
- మనువాడే వ్యక్తితో స్టైలిష్ ఫొటో దిగిన మెహరీన్
- దేశంలో కొత్తగా 15,388 కొవిడ్ కేసులు
- రైతు ఆందోళనలపై బ్రిటన్ ఎంపీల చర్చ.. ఖండించిన భారత్
- అమ్మమ్మ మాదిరిగా హావభావాలు పలికించిన సితార- వీడియో
- అభివృద్ధిని చూసి ఓటెయ్యండి : ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి
- మహిళను ముక్కముక్కలుగా నరికేశారు..
- తొమ్మిదికి పెరిగిన మృతులు.. ప్రధాని సంతాపం
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్