Zindagi
- Feb 23, 2021 , 02:45:17
VIDEOS
పిల్లలు పరధ్యానంగా ఉంటున్నారా?

‘పిల్లలు పరధ్యానంగా ఉంటున్నారు’.. చాలామంది తల్లిదండ్రులు చేసే ఫిర్యాదు ఇది. కానీ, ఆ స్వభావానికి తల్లిదండ్రులే కారణమని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అతిగారాబం చేసినా, అతిగా నియంత్రించినా సమస్యే! మరి పిల్లలను తీర్చిదిద్దడం ఎలా అంటారా? ఇదిగో ఇలా..
- అమ్మానాన్నల మధ్య అనుబంధం పిల్లలపై ప్రభావం చూపుతుంది. భార్యాభర్తలిద్దరూ తరచూ కీచులాడుకుంటే అది చిన్నారుల హృదయాలను గాయపరుస్తుంది. పేరెంట్స్‌పై ప్రేమాభిమానాలు పెరిగే చోట భయం, ద్వేషం కలుగుతాయి. అందుకే గొడవలకు స్వస్తి పలకాలి.
- ఉద్యోగంలో చికాకులతోనో, ఆర్థిక సమస్యలతోనో పెద్దలు ఇంట్లో మూడీగా ఉంటే.. పిల్లలూ అలాగే తయారవుతారు. మీ ఇబ్బందులను ఇంటి బయటే విడిచిపెట్టేయండి. ఆఫీస్ నుంచి రాగానే పిల్లలతో అరగంటయినా సరదాగా గడపండి.
- పేరెంట్స్ ఇచ్చే చిన్ని ప్రశంసే చిన్నారులకు కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అడపాదడపా బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తే పిల్లలు ఎప్పుడూ చలాకీగా తయారవుతారు.
- అబద్ధాలు చెప్పడం, సమయ పాలన లేకపోవడం.. ఇవన్నీ తల్లిదండ్రుల ప్రవర్తన ఆధారంగానే నేర్చుకుంటారు. అందుకే, పెద్దలూ క్రమశిక్షణతో మెలగాలి.
తాజావార్తలు
- నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. వెయ్యి పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- దీపిక పదుకొణే బ్యాగ్ దొంగిలించే ప్రయత్నం..!
- బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ వెలిగిస్తే రూ. 1000 జరిమానా
- అమెరికా వైమానిక దాడిలో 17 మంది మిలిటెంట్లు మృతి
- దేశంలో కొత్తగా 16,577 కొవిడ్ కేసులు
- బన్నీ సినిమాను రిజెక్ట్ చేసిన ప్రియా ప్రకాశ్.. !
- 100 జిలటిన్ స్టిక్స్.. 350 డిటోనేటర్లు స్వాధీనం
- ప్రముఖ తెలుగు రచయిత్రి పెయ్యేటి దేవి ఇకలేరు
- మార్చి 4 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఐదో దశ పరీక్షలు
- నేడు ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ స్నాతకోత్సవం.. ప్రసంగించనున్న ప్రధాని
MOST READ
TRENDING