శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Zindagi - Feb 23, 2021 , 02:45:12

పిల్లి-మనిషి

పిల్లి-మనిషి

అనగనగా ఒక అడవి. అందులో ఓ పిల్లి ఉండేది. ఓరోజు అది పొదల్లో చిక్కుకున్నది. బయటికి రాలేక నానా తంటాలూ పడింది. కొద్దిసేపటి తర్వాత అరవటం మొదలుపెట్టింది. అదే దారిలో ఓ బాటసారి వెళ్తున్నాడు. అరుపులు విని ఏమిటా అని చుట్టూ చూశాడు. పొదల్లో చిక్కుకున్న పిల్లి కనిపించింది. ఎలాగైనా దానిని బయటికి తీయాలని ప్రయత్నించాడు. కానీ పిల్లికి ఆ సంగతి అర్థం కాలేదు. తనమీద దాడికి వస్తున్నాడేమో అనుకుంది. బాటసారి దగ్గరకు రాగానే భయపడిపోయింది. పిల్లిని తీయబోతూ, చేతులు ముందుకు చాచాడు బాటసారి. ఆ చేతులమీద పిల్లి గాట్లు పెట్టింది. చాలాసేపటి తర్వాత అదే దారిలో మరో బాటసారి వచ్చాడు. పిల్లి ప్రవర్తనను చూసి అతను మొదటి బాటసారితో ‘పోనీలే అలాగే వదిలెయ్యి. అది జంతువు. ఎలా బయట పడాలో దానికి తెలుసు’ అన్నాడు. కానీ మొదటి వ్యక్తి వదిలెయ్యలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి, పిల్లిని ఆ చిక్కులోంచి రక్షించాడు. ‘అవును. పిల్లి జంతువే. తన జోలికి వచ్చినవాళ్లని రక్కడం, గాయం చెయ్యటం దాని స్వభావం. కానీ, నేను మనిషిని. నా నైజం జాలి, దయ, కరుణ. గాయాలదేముంది? రెండ్రోజుల్లో మానిపోతాయి’ అని చెప్పాడు. నిజమే, గాయం చేయడం జంతు స్వభావం. సాయం చేయడం మనిషి స్వభావం. 

VIDEOS

logo