నటన మర్చిపోలేదు!

‘పెళ్లి చూపులు’ సినిమాతో ‘కుర్రాడు బాగున్నాడే!’ అనిపించుకున్న విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో యూత్ ఐకాన్‌గా మారాడు. ‘గీత గోవిందం’తో అందరివాడయ్యాడు. తన వేషభాషలతో తెలుగువారందరికీ ఫేమస్ లవర్ అయిపోయాడు. ఇప్పుడు హీరో ఇమేజ్ను పదింతలు పెంచే దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిశాడు విజయ్. లాక్డౌన్ తర్వాత ‘లైగర్' షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీ అయిన విజయ్‌తో చిట్‌చాట్..
ఇంత గ్యాప్ వస్తుందని అస్సలు అనుకోలేదు. అంతా లాక్డౌన్ ఎఫెక్ట్. చాలా రోజులు ఇంట్లో హ్యాపీగా గడిపా. కడుపు నిండా తిన్నా. కంటి నిండా నిద్రపోయా. వర్కవుట్స్ ఎలాగూ తప్పవు. స్నేహితులతో హాయిగా కాలక్షేపం చేశా. కొన్ని నెలల గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ సెట్లోకి అడుగు పెట్టినప్పుడు డిఫరెంట్‌గా అనిపించింది. కొంత నెర్వస్‌గా కూడా ఫీలయ్యా. కానీ, యాక్షన్ అనగానే షరా మామూలే! యాక్టింగ్ బాగానే గుర్తుందే అనిపించింది.
లాక్డౌన్ టైమ్‌లో సినిమాలను నిలబెట్టింది ఓటీటీ వేదికలే. కరోనా ఒత్తిడి నుంచి ప్రజలను కాస్త కాపాడిందీ అవే. సినీ ఇండస్ట్రీకి ఓటీటీలు ఒయాసిస్‌లా వరమయ్యాయి. మా తమ్ముడు ఆనంద్ నటించిన ‘మిడిల్‌క్లాస్ మెలోడీస్' ఓటీటీలోనే రిలీజై మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమాను నేనూ బాగా ఎంజాయ్ చేశాను. సినిమా థియేటర్లు ఓపెనయ్యాయి. వరుసగా సినిమాలూ రిలీజవుతున్నాయి. ఓటీటీకి ఆదరణ తగ్గుతుందని అనుకోవడం లేదు. కానీ, థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 100 శాతం అక్యుపెన్సీ సాధిస్తున్నాయి. ఇవన్నీ ఇండస్ట్రీకి శుభపరిణామాలు.
‘లైగర్' షూటింగ్ మొదలవ్వడంతో హ్యాపీగా ఫీలయ్యా. నేనైతే డైరెక్టర్‌తో టైట్ షెడ్యూల్స్ కంటిన్యూ చేయమన్నా. అంతగా కావాలనుకుంటే హోటల్‌కు కూడా వెళ్లకుండా సెట్లోనే పడుకుంటా. ఇన్ని రోజులు షూటింగ్స్ మిస్ అయిన ఫీలింగ్ నన్ను ఊరికే ఉండనివ్వడం లేదు. ఇన్నాళ్లు తీసుకున్న విశ్రాంతి చాలు.. ఇక విశ్రమించేది లేదని చెప్పా.
ఫ్యాషన్ విషయంలో హద్దులు పెట్టుకోవడం నాకస్సలు నచ్చదు. నాకు ఎలా ఉండాలనిపిస్తే ఆలా ఉంటాను. ఓ రోజు హిప్-హప్ లుక్‌లో ఉండాలనిపిస్తుంది. ఇంకోరోజు జపనీస్ ఫ్యాషన్ ఎంచుకోవాలనిపిస్తుంది. నా మనసుకు తోచింది ఫాలో అయిపోతానంతే! ఈ విషయంలో ఎవరేం అనుకుంటారో అస్సలు పట్టించుకోను.
తాజావార్తలు
- నాయకులు సమన్వయంతో పనిచేయాలి
- ఝూటా మాటల బీజేపీ
- ప్రతి 100మందికి ఒక ఇన్చార్జి
- సేవలపై సిటిజన్ ఫీడ్‌బ్యాక్
- నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి
- జన్నేపల్లి శివాలయంలో.. అభివృద్ధి పనులు ప్రారంభం
- వాణీదేవికి పెరుగుతున్నమద్దతు
- భ్రమరాంభికా మల్లికార్జున స్వామి కల్యాణం
- ఇంటింటికీ తిరిగి పట్టభద్రుల ఓట్లు అభ్యర్థించాలి
- Nనో.. Dడాటా.. Aఅవైలబుల్..