ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Zindagi - Feb 17, 2021 , 00:04:18

ఫర్నీచర్‌ పెయింటింగ్స్‌!

ఫర్నీచర్‌ పెయింటింగ్స్‌!

గృహాలంకరణ అంటే అందరికీ మక్కువే. ముఖ్యంగా మహిళలు ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి చాలా ఆసక్తి చూపుతారు. కళాకారుల కుంచెలనుంచి జాలువారిన చిత్రాలను చెక్క ఫ్రేముల్లో బంధించి గోడలకు వేలాడదీస్తుంటారు. కానీ, ఏకంగా చెక్కపైనే అభిరుచికి తగినట్లు రకరకాల చిత్రాలను తీర్చిదిద్దుతున్నారు హైదరాబాద్‌కు చెందిన ఆర్తీ నాగ్‌పాల్‌. చిత్రకళపై ఆసక్తితో గచ్చిబౌలిలో ‘ఆర్ట్‌ అండ్‌ ఐ’ అనే ఫర్నీచర్‌ పెయింటింగ్‌ సంస్థను ప్రారంభించారామె. ఇంట్లో అన్ని వస్తువులూ మారుతున్నా, చెక్కతో చేసినవి మాత్రం అలాగే ఉంటాయి. అలా అని, చూస్తూ పారేయలేం. పాత ఫర్నీచర్‌ను ఆధునిక కాలానికి తగినట్లు మలిచేందుకు భిన్నమైన రూపాన్నిస్తున్నారు ఆర్తి. ‘కళకు పరిమితులు లేవు. పెయింటింగ్స్‌ అంటే గోడలకు వేలాడేవే కాదు’ అనేది ఫర్నీచర్‌ డిజైనర్‌ ఆర్తి నినాదం.


VIDEOS

logo