ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Zindagi - Feb 12, 2021 , 01:43:16

శునక వైభోగం

శునక వైభోగం

ప్రపంచవ్యాప్తంగా మనుషులకు ఉన్నట్లే పెంపుడు జంతువులకోసం కూడా సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, మసాజ్‌ సెంటర్లు, దవాఖానలు, హోటళ్ళు, డే కేర్‌ సెంటర్లు ప్రారంభమయ్యాయి. మనదేశంలోనూ పెంపుడు జంతువులకోసం మొట్టమొదటి ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ‘క్రిటెరాటి’ ని ప్రారంభించారు గురుగ్రామ్‌కు చెందిన జాన్వీ, దీపక్‌ చావ్లా. జంతువుల ఆహారం, అవసరాలే ప్రధానంగా ఏర్పాటైంది క్రిటెరాటి. అయితే, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా చాలామంది విదేశాల్లో చిక్కుకోవడంతో, ఇక్కడున్నవారి పెంపుడు జంతువుల పోషణ ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలోనే హోటల్‌ని కాస్తా హాస్టల్‌గా మార్చారు దీపక్‌ చావ్లా. సకల సౌకర్యాలతో యజమాని లేని లోటు తెలియకుండా సంరక్షించారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడూ బాధపడనక్కర్లేదు. ‘పెంపుడు జంతువులంటే చాలామందికి పిల్లలతో సమానం. అందుకే మేం వాటిపట్ల  ప్రేమగా ఉంటాం. కరోనా టైమ్‌లో వాటికి ఎటువంటి హానీ కలగకుండా పెట్‌ ఫ్రెండ్లీ శానిటైజర్స్‌తో అణువణువూ శుభ్రం చేస్తున్నాం. స్విమ్మింగ్‌పూల్‌లోనూ క్లోరిన్‌కి బదులు యూవీ టెక్నాలజీ ద్వారా నీటిని శుభ్రపరుస్తాం’ అంటూ తమ కస్టమర్లకు అందించే సేవలను వివరిస్తున్నారు క్రిటెరాటి నిర్వాహకులు జాన్వీ, దీపక్‌ చావ్లా.    

VIDEOS

logo