ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Zindagi - Feb 06, 2021 , 00:35:54

సేవ్‌...‘ఉంగరాల జుటు’్ట!

సేవ్‌...‘ఉంగరాల జుటు’్ట!

‘ఉంగరాల జుట్టే మగువకు అందం. దాన్ని అలాగే ఉండనివ్వండి’ అంటూ ‘హెయిర్‌ మీ అవుట్‌' ప్రచారం మొదలుపెట్టింది ప్రముఖ హెయిర్‌ అండ్‌ స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ ‘ది అర్బన్‌ లవ్‌'. మన దేశంలో దాదాపు 60 శాతం స్త్రీలకు సహజంగానే ఉంగరాల జుట్టు ఉంటుంది. కానీ ఉంగరాల జుట్టు ఉన్నవాళ్లని సమాజం చిన్నచూపు చూస్తుందన్న భయంతో చాలామంది మహిళలు హెయిర్‌ స్ట్రెయిట్‌నర్‌, స్ప్రే వంటి కృత్రిమ పద్ధతులద్వారా కేశాల్ని నిటారుగా మార్చుకుంటున్నారు. మగువల ఆహార్యానికి తగినట్టు వారి జుట్టు ఉంటుందనీ, దాన్ని అలాగే స్వేచ్ఛగా ఉండనివ్వాలని పిలుపునిస్తున్నారు ఉంగరాల జుట్టు ఉద్యమకారులు. ఉంగరాల జుట్టు వారు ఎదుర్కొంటున్న సమస్యలు, కేశాల నిర్వహణలో సవాళ్ల గురించి చక్కని సందేశంతో కూడిన వీడియోలు పెడుతున్నారు. ప్రస్తుతం హెయిర్‌ స్ట్రెయిట్‌నర్‌ మహిళల నిత్యావసరాల్లో ఒకటిగా మారిందనీ, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఉంగరాల జుట్టు అంతరిస్తుందనే భయం వారి మాటల్లో వినిపిస్తున్నది.

VIDEOS

logo