ఆదివారం 07 మార్చి 2021
Zindagi - Feb 05, 2021 , 01:30:39

నాసా ఆమె కనుసన్నల్లో..

నాసా ఆమె కనుసన్నల్లో..

అమ్మాయిలు అన్ని రంగాల్లో అగ్రస్థానాలను అధిరోహిస్తున్నారు. అవకాశం రావాలే గానీ అనుకున్న లక్ష్యాన్ని అందుకునే వరకు విశ్రమించరు వారు. ఇటీవలే అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ఇండో అమెరికన్‌ కమలా హ్యారిస్‌ గురించి ఎంతో గర్వంగా చెప్పుకున్నాం. ఇప్పుడు మరో ఇండో అమెరికన్‌ మహిళ భవ్యాలాల్‌ నాసా (నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌)కు యాక్టింగ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా ప్రమోట్‌ అయ్యారు. న్యూక్లియర్‌ ఇంజినీరింగ్‌ చేసిన భవ్యాలాల్‌ టెక్నాలజీ అండ్‌ పాలసీలో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ పట్టా పొందారు. జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీ నుంచి పబ్లిక్‌ పాలసీ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టరేట్‌ చేశారు. చదువు పూర్తయిన తర్వాత సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ ఇనిస్టిట్యూట్‌లో రీసెర్చ్‌ స్టాఫ్‌గా పనిచేశారామె. అంతేకాదు, వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, నేషనల్‌ స్పేస్‌ కౌన్సిల్‌, నాసాలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌ కమ్యూనిటీలోనూ పలు బాధ్యతలు నిర్వహించారు భవ్యాలాల్‌. తాజాగా నాసాలో ఉన్నత పదవిని అలంకరించారు. నాసాకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ ఇప్పుడు తనే చూడాల్సి ఉంటుంది. స్పేస్‌ టెక్నాలజీలో అపారమైన అనుభవం, పరిజ్ఞానం ఉండటంతో ఈ ప్రతిష్ఠాత్మకమైన పదవి భవ్యాలాల్‌ను వరించింది.

VIDEOS

logo