మంగళవారం 02 మార్చి 2021
Zindagi - Feb 04, 2021 , 00:38:29

సరిహద్దు.. అన్నపూర్ణమ్మలు!

సరిహద్దు.. అన్నపూర్ణమ్మలు!

మహిళలు తలచుకుంటే ఏదైనా చేయగలరని నిరూపిస్తున్నారు లద్దాఖ్‌కు చెందిన పన్నెండుమంది మహిళలు. ఉదయం 9 గంటలకల్లా గ్యాస్‌ప్లాంట్‌కి చేరుకుని గడ్డకట్టే చలిలోనూ తమ విధులను నిర్వర్తిస్తున్నారు. వాళ్లంతా ఇండియన్‌ ఆయిల్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్యాస్‌ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. గ్యాస్‌ నింపే ఐదుగురు మగ ఉద్యోగులు మినహా అన్ని పనులూ వీళ్లే చేస్తారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి గ్యాస్‌ సరఫరా చేస్తూ సుమారు 50 వేలమంది ఆకలిని తీరుస్తున్నారు. దేశంలో మహిళలు నిర్వహిస్తున్న ఏకైక గ్యాస్‌ప్లాంట్‌ ఇదే. వీరంతా, ఉదయాన్నే పనులన్నీ ముగించుకుని, పిల్లల బాధ్యతను ఇంట్లోని పెద్దలకు అప్పగించి విధులకు హాజరవుతారు. ఒకప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ బిగించడం కూడా తెలీని తాము ఈ రోజు ఏకంగా గ్యాస్‌ ప్లాంట్‌ను నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందంటున్నారు ఈ మహిళామణులు. గడ్డ కట్టే చలిలో దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి గమ్యానికి చేరుతున్న ఈ మగువల కృషికి దేశమంతా గర్విస్తున్నది. 


VIDEOS

logo