ఆదివారం 07 మార్చి 2021
Zindagi - Feb 04, 2021 , 00:38:29

అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి?

అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి?

తారా కౌశల్‌ను చిన్నప్పటి నుంచీ ఓ ప్రశ్న వేధించేది. ‘అసలు రేపులు ఎందుకు జరుగుతాయి?’ అని చాలాసార్లు తనను తాను ప్రశ్నించుకునేవారు. స్నేహితులనూ అడిగేవారు. ఎవరి దగ్గరా తగిన జవాబు రాలేదు. చదువుకునే రోజుల్లో పోకిరి చేష్టలను చాలానే భరించారామె. ఆ భయంతో కాలేజీ మానేసిన సందర్భాలూ ఉన్నాయి. కొన్నిసార్లు బ్యాగులో కత్తిపెట్టుకుని వెళ్లేవారట ఆత్మరక్షణ కోసం. జర్నలిస్టుగా మారాక, ఇదే విషయం మీద చాలా కథనాలే రాశారు. అవేవీ సమగ్రంగా అనిపించలేదు. దీంతో, ఎంతోమంది రేపిస్టులను ఇంటర్వ్యూ చేసి.. ఆ పైశాచిక చర్య దిశగా ఉసిగొల్పిన కారణాల్ని తెలుసుకున్నారు. వారిలో డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉన్నారు. ఆ వివరాలతో ‘వై మెన్‌ రేప్‌' పుస్తక రచన ప్రారంభించారు. ‘చాలామంది మానసిక కారణాలతోనే రేపిస్టులుగా మారుతున్నారు. పిల్లల పెంపకంలోనూ మార్పు రావాలి. ఆడ పిల్లల్ని ఒకలాగా, మగ పిల్లల్ని ఇంకోలాగా పెంచడం మానుకోవాలి’ అంటూ ముక్తాయిస్తారు తార.  

VIDEOS

logo