గురువారం 04 మార్చి 2021
Zindagi - Feb 01, 2021 , 01:58:43

ఆడపిల్లలకు ఫోన్లు ఇవ్వం!

ఆడపిల్లలకు ఫోన్లు ఇవ్వం!

ఆడపిల్లలు సెల్‌ఫోన్‌లో మాట్లాడటం తప్పు, వాళ్లకంటూ ఓ సెల్‌ఫోన్‌ ఉండటం ఇంకా తప్పు. పది రాష్ర్టాల్లో 4100 మందిపై జరిపిన సర్వే ప్రకారం..స్మార్ట్‌ఫోన్‌ వాడితే ఆడపిల్లలు చెడిపోతారన్న అభిప్రాయం దాదాపు 71 శాతం ప్రజల్లో ఉంది. దేశంలోని వివిధ రాష్ర్టాల్లోని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై జరిపిన ఈ సర్వేలో నమ్మశక్యంకాని విషయాలు బయటపడ్డాయి. బాలికలకు స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్‌నెట్‌ వాడకానికి అనుమతి ఇవ్వడంలో అస్సాం వెనుకబడి ఉంది. కర్ణాటక ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంట్లో మొబైల్‌ ఉంటే తండ్రి తర్వాత కొడుకు మాత్రమే వాడాలి. ఒకవేళ ఆడవాళ్ళు వాడాల్సివస్తే మగవారి అనుమతి తప్పనిసరి. కొన్ని ప్రాంతాల బాలికలకు స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్‌నెట్‌ వాడకం గురించి కనీస అవగాహన కూడా లేదు. కొంతమందికి కాల్స్‌ చేయడం వరకే తెలుసు. కొవిడ్‌ మహమ్మారి దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న వివక్షను మరింత తీవ్రతరం చేసిందంటున్నారు సర్వే ఫలితాలను వెల్లడించిన సెంటర్‌ ఫర్‌ కాటలైజింగ్‌ చేంజ్‌, డిజిటల్‌ ఎంపవర్‌మెంట్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు.

VIDEOS

logo