శుక్రవారం 05 మార్చి 2021
Zindagi - Jan 30, 2021 , 00:46:57

వర్చువల్‌ స్నేహాలకు జై

వర్చువల్‌ స్నేహాలకు జై

లాక్‌డౌన్‌ మొదలైన రోజునుంచి ఇప్పటి వరకూ చాలామంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. కరోనా భయంతో ఫంక్షన్లు, పార్టీలకు దూరమైపోయి వర్చువల్‌ స్నేహాలకు, బంధాలకు మాత్రం దగ్గరగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా, ఈ 2021లో వర్చువల్‌ డేటింగ్‌కే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నట్లు తాజా నివేదిక తెలిపింది.

బెంగళూరుకు చెందిన 27 ఏండ్ల శ్రేయ గత రెండేండ్లుగా ఉద్యోగరీత్యా వివిధ నగరాలు తిరిగింది. ఆ ప్రయాణంలో కొన్ని పరిచయాలు స్నేహంగా మారి, చివరికి బ్రేకప్‌ అయ్యాయి. అయితే లాక్‌డౌన్‌ నుంచి ఆమె వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూ, ఒక అబ్బాయితో కొన్ని నెలలుగా ఫోన్లో చాటింగ్‌ చేస్తున్నది. ఇద్దరూ తమ వ్యక్తిగత అలవాట్లు, ఇష్టాయిష్టాలను గురించి చెప్పుకొంటున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు. ‘మా ఇద్దరి ప్రయాణం చాలా నెమ్మదిగా నడుస్తున్నది. ఒకర్నొకరం లోతుగా అర్థం చేసుకుంటున్నాం. ఇప్పటికిప్పుడు కలుసుకోవాలని మేమేం అనుకోవట్లేదు. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టాక నింపాదిగా భేటీ అవుతాం. ఈలోపు వర్చువల్‌గా మా బంధం మరింత బలపడుతుందని ఆశిస్తున్నా’ అంటూ తన ఇ-డేటింగ్‌ గురించి చెప్పుకొచ్చింది శ్రేయ.

ఇంతకీ, సర్వే ఏం చెప్తున్నది..?

బంబుల్‌ అనే సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో సింగిల్‌ ఇండియన్స్‌లో నలభైశాతం మంది వర్చువల్‌ డేటింగ్‌కు మద్దతుగా సమాధానాలు చెప్పారు. 2021లో కొత్త పరిచయాలూ, స్నేహాలూ, ప్రేమలూ ఆన్‌లైన్‌ చాటింగ్‌ ద్వారానే జరగొచ్చని ఈ సర్వే స్పష్టం చేసింది. కరోనా కారణంగా ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్న యువతలో 47శాతం మంది డేటింగ్‌ యాప్స్‌ని ఉపయోగిస్తున్నారట. “2020 సవాళ్ల తర్వాత చాలామంది కొత్త బంధాల కోసం వర్చువల్‌ మీట్స్‌నే ఎంచుకుంటున్నారు. ఒక మనిషిని ప్రత్యక్షంగా కలిసేందుకు ముందు కొన్నిరోజుల పాటు చాటింగ్‌, వీడియో కాల్స్‌లో సంభాషించాలని భావిస్తున్నారు’ అని విశ్లేషించారు బంబుల్‌ సంస్థ ప్రతినిధి సమర్పిత సమద్దార్‌.

VIDEOS

logo