బుధవారం 03 మార్చి 2021
Zindagi - Jan 29, 2021 , 02:28:12

వావ్‌ నట్స్‌!

వావ్‌ నట్స్‌!

చూసేందుకు బుల్లిబుల్లి మెదళ్లలా కనిపించే వాల్‌నట్స్‌ మెదడు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతాయి. మతిమరుపు తగ్గడానికి ఉపకరించి, మెదడు కణాలను ఉత్తేజ పరచగల ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఇందులో పుష్కలం. అల్జీమర్స్‌ లక్షణాలను తగ్గించే పోషకాలూ అపారమే. 

  • డ్రై ఫ్రూట్స్‌ అంటేనే పోషకాల గనులు. వాటిలో ఒకటి వాల్‌నట్స్‌. రుచికి కాస్త చేదుగా ఉన్నా శరీరానికి కావలసిన పోషకాలు మాత్రం అనేకమని అంటున్నారు నిపుణులు. 
  • పీనట్‌ బటర్‌లానే, వాల్‌నట్స్‌తోనూ వెన్న చేసుకుని తినవచ్చు. అంతేకాదు రకరకాల మసాలా కూరలలోనూ బాదం, జీడిపప్పు, పల్లీలకు ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు.
  • పిల్లల ఎదుగుదలలో వాల్‌నట్స్‌ ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిలోని ప్రొటీన్లు, ఫైబర్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, జింక్‌, సెలీనియం, విటమిన్‌-బి శరీరం దృఢంగా తయారవడానికి దోహదపడుతాయి. 
  • మాంసాహారంలోనే దొరికే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ వాల్‌నట్స్‌ ద్వారా లభిస్తాయి. శాకాహారులకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను అందించే ఏకైక ఆహారం ఇదే.
  • వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-ఇ, మెలటోనిన్‌, కెరోటినాయిడ్‌ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
  • వాల్‌నట్స్‌లో ఉపయోగకరమైన బ్యాక్టీరియాను పెంచే లక్షణాలు ఉండటం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. తద్వారా అజీర్తి సమస్య ఉండదు.
  • చర్మకాంతిని పెంచడంలో వాల్‌నట్స్‌ ప్రధానపాత్ర పోషిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌-బి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్‌ నుండి కాపాడుతాయి. రోజూ వాల్‌నట్స్‌ తీసుకోవడం వల్ల  చర్మంపై ముడతలు తగ్గుతాయి. 
  • వాల్‌నట్స్‌ గుండె ఆరోగ్యానికి దోహదపడుతాయి. కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించి రక్తనాళాల పనితీరుని మెరుగు పరుస్తాయి. 

VIDEOS

logo