నీలి నీలి అన్నం..

వైట్‌రైస్, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్.. ఇప్పుడు బ్లూరైస్ వంతు. మనదేశంలో ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నా బటర్ ఫ్లై పీ పువ్వులతో తయారుచేసే బ్లూ రైస్ మలేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఎప్పటినుంచో ఉంది. అక్కడ ఈ స్పెషల్ రైస్‌ని ‘నాసి కెరాబు’ అని పిలుస్తారు. బటర్ ఫ్లై పువ్వులంటే ఏవో విదేశీ పూలనుకునేరు.. మన దగ్గర విరివిగా కనిపించేవే. గ్రామీణ ప్రాంతాల్లో చేను గట్లెంబడి పెరుగుతాయి ఈ మొక్కలు. వీటిని స్థానికంగా కట్లపువ్వులు, నెమలి పువ్వులు, శంఖం పువ్వులు అని పిలుస్తారు.
ఏషియన్ రుచుల్లో ఒకటైన ఈ బ్లూరైస్ మనదేశంలోనూ కొన్ని ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉంది. ఇటీవల బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన స్నేహితులతో కలిసి బ్లూ రైస్ తింటున్న సందర్భాన్ని అభిమానులతో పంచుకుంది. ఇదివరకు కూల్‌డ్రింక్స్‌కి బ్లూ, పర్పుల్ రంగు తెప్పించేందుకు మిక్సాలజిస్టులు బటర్ ఫ్లై పీ పువ్వులను వాడేవారు. కానీ ఆ పూలలోని పోషకాల గురించి తెలిశాక ఆహారంలో భాగంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు నిపుణులు. బటర్ ఫ్లై పీ ఫ్లవర్లో శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని డీటాక్సిఫై చేయడమే కాకుండా చర్మం కాంతిమంతంగా మెరవడానికి దోహదపడతాయంటున్నారు పరిశోధకులు.బ్లూ రైస్ తయారీ: బ్లూ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు బటర్ ఫ్లై పీ పువ్వులు, బియ్యం మాత్రమే. ముందుగా బియ్యాన్ని కడిగి తగినన్ని నీళ్లుపోసి ఉడికించుకోవాలి. ఐదునిమిషాలయ్యాక కాడలు తీసేసి కడిగి పెట్టుకున్న పువ్వులను వేసి కలుపుకుని బాగా ఉడికించాలి. పువ్వుల రంగు ఉడుకుతున్న బియ్యానికి పట్టి అన్నం నీలిరంగులోకి మారుతుంది. వంగపండు (పర్పుల్) రంగులో కావాలనుకుంటే ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి. ఈ బ్లూ రైస్‌ని మామూలు అన్నంలానే ఏ కూరతో అయినా తినేయవచ్చు.
తాజావార్తలు
- ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్
- దర్శకుడికే టోకరా వేసిన కేటుగాడు
- ట్రక్కు బోల్తా.. ఆరుగురు మృతి.. 15 మందికి గాయాలు
- ఎల్లో డ్రెస్‌లో అదరగొడుతున్న అందాల శ్రీముఖి..!
- లారీని ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం
- నా రేంజ్ మీకు తెలుసా అంటూ షణ్ముఖ్ వీరంగం..!
- రాజశేఖర్ కూతురు తమిళ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్
- డేటా చోరీ గిఫ్ట్‌ల పేర బురిడీ..!
- షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు