ఇంట్లో లేకున్నా వంట చేస్తుంది!

పని మీద బయటకు వెళ్తాం. ఇంటికి చేరడానికి గంట పట్టొచ్చు. ఆకలేమో దంచేస్తుంది. కానీ పని ఒత్తిడి, ట్రాఫిక్ చిరాకు వల్ల ఇంటికి వెళ్లి ఫ్రెషప్ అవడానికే ఆపసోపాలు పడతాం. ఇక, వంట ఎక్కడ చేసుకుంటాం? ‘చల్ ఎవరు చేస్తార్లే’ అని కొందరు ఉపాసం ఉంటే.. మరికొందరు ఏ బజారుకో వెళ్లి రెడీమేడ్‌గా దొరికే ఆహారం తెచ్చుకుంటారు. కానీ ఇలా ఎన్నిరోజులు?
ఇలాంటి సమస్యేదీ ఉండొద్దని ఒక కొత్త పరికరాన్ని తయారు చేశాడు హైదరాబాద్‌కు చెందిన గౌతమ్ గాంధీ నాదెండ్ల. యాప్ సాయంతో వంట చేసుకునే సౌకర్యాన్ని కల్పించాడు. దీనికోసం గంటల కొద్దీ కష్టపడాల్సిన పనిలేదు. చాలా సింపుల్.. మీరు ఇంట్లో లేకుండానే వంట చేసిపెట్టే పరికరం ఇది. పేరు ‘రికు’. మీకు పాలకూర పప్పు కావాలనుకోండి.. రికు యాప్‌లో ‘పాలకూర పప్పు’ అని టైప్ చేస్తే, ఇంటికెళ్లే సరికి సిద్ధంగా ఉంటుంది. కాకరకాయ వేపుడు అయినా, కోడికూర అయినా అంతే. ఒక కుకర్లాంటి పాత్రలో రెండు అరలు ఉంటాయి. ఒక సగంలో వంట కోసం కావాల్సిన దినుసులన్నీ నింపాలి. ఇంకో అరలో కూరగాయలు సర్దాలి. మొబైల్లో రికు యాప్ ఇన్స్టాల్ చేసుకొని.. మెషిన్‌తో అనుసంధానం చేసుకోవాలి. మీకు ఏం కావాలో యాప్ ద్వారా సమాచారం ఇస్తే, వెళ్లేలోపు వేడివేడి వంట నోరూరిస్తూ ఉంటుంది. అమెరికాలో ఎంఎస్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన గౌతమ్, మూడేండ్ల క్రితం ‘ఫ్యూచరిస్టిక్ ల్యాబ్'ను స్థాపించాడు. దాని ద్వారా ‘రికు’ను రూపొందించాడు. వంటలు చేయడం మాత్రమే కాదు.. మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు ఏ రకమైన ఆహారం తీసుకోవాలో..ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా ఈ యాప్ సూచిస్తుంది. పూర్తి వివరాలకు: getriku.com.
తాజావార్తలు
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..
- పూరీ వారసుడు ఈ సారైన హిట్ కొడతాడా..!
- కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోదీ
- తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. యువ నిర్మాత కన్నుమూత
- మన వ్యాక్సిన్ సురక్షితమైంది: హీరో సందీప్‌కిషన్
- అన్నదానం ఎంతో గొప్పది: శేఖర్ కమ్ముల
- అతివేగం.. మద్యం మత్తు