ఆడవాళ్లకు ‘ఆప్షన్' లేదు

ముఖ్య కుటుంబ నిర్ణయాల్లో సాధారణంగానే మహిళల జోక్యం తక్కువ. జీవిత భాగస్వామి ఎంపికలోనూ ఆమె మాటకు విలువనివ్వరు. తాజాగా, ఓ సర్వే ఇంకొన్ని కొత్త విషయాల్ని తేల్చి చెప్పింది. అదేమిటంటే, తల్లిదండ్రులు చూపించిన అబ్బాయిని పెండ్లి చేసుకున్న అమ్మాయిలకంటే సొంతంగా భర్తను ఎంచుకున్నవాళ్లకే ఇంట్లో ఆధిపత్యం ఉంటుందట. ఈ సర్వేను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఐప్లెడ్ ఎకనామిక్ రిసెర్చ్‌కు చెందిన మంజిష్ట బెనర్జీతోపాటు డ్యూక్ గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్కు చెందిన అశ్విని దేశ్‌పాండే నిర్వహించారు. 21వేల మంది వివాహిత మహిళలు, వాళ్ల భర్తలు, అత్తామామలతో మాట్లాడారు సర్వేకారులు. మొత్తంగా, ఇంట్లో తీసుకునే పెద్దపెద్ద నిర్ణయాల్లో మహిళల పాత్ర తక్కువేనని స్పష్టంగా తేలింది. అలాగే, పిల్లలకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఏ డాక్టరు దగ్గరికి తీసుకెళ్లాలనే నిర్ణయం దగ్గర్నించి ఇంట్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాల కొనుగోలు వరకూ మహిళల ఇష్టంతో సంబంధం లేకుండా పనులు జరిగిపోతున్నాయట.
తాజావార్తలు
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
- పార్వో వైరస్ కలకలం.. 8 కుక్కలు మరణం
- అక్రమంగా నిల్వ చేసిన కలప స్వాధీనం
- గోవధ ఘటనపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఘన సన్మానం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే
- దేశీయ విమానయానం ఇక చౌక.. ఎలాగంటే!