గురువారం 25 ఫిబ్రవరి 2021
Zindagi - Jan 21, 2021 , 00:03:56

పుష్పాభరణాలు!

పుష్పాభరణాలు!

ప్రపంచంలో పుష్పాలను ఇష్టపడని వాళ్లుంటారా? రంగురంగుల్లో కండ్లను కట్టిపడేసే పూలను చూస్తే మనసు ఉల్లాసంగా మారుతుంది. అయితే ఏ పువ్వయినా ఒకటి లేదా రెండు రోజుల్లో వాడిపోతుంది, ఆపైన ఎండిపోతుంది. అలా కాకుండా, నిత్యం నిగనిగలాడుతూ, ప్రతిక్షణం పరిమళించే పూలు.. చేతి గాజుల్లోనో, చెవుల జూకాల్లోనో, మెడలోని గొలుసుల్లోనో ఉంటే ఎంత బాగుంటుంది! ఆ అవకాశమే వస్తే ఏ అమ్మాయి మాత్రం వద్దనుకుంటుంది. అచ్చం ఇలాంటి ఆలోచనే వచ్చింది తమిళనాడుకు చెందిన అమృత గిరిరాజ్‌ అనే యువతికి. ముందునుంచీ తనకు రీసైక్లింగ్‌ పట్ల ఆసక్తి.  అనుకున్నదే తడవుగా ‘అలంకార’ అనే లేబుల్‌తో తన ఐడియాకు రూపం ఇచ్చింది. తాజా పూలు, పూరేకులు, వాడిన పూలను నగల్లో వాడేస్తుంది. గులాబీ, మల్లె, చామంతితో పాటు ప్రపంచంలోని అన్ని రకాల ఎక్సోటిక్‌ పూలనూ జ్యువెలరీలో భాగం చేసింది. జుంకాలు, గాజులు, హెయిర్‌ పిన్నులు, ముక్కు పుడకలు, ఉంగరాలు, చెయిన్‌ లాకెట్ల తయారీలో రకరకాల పూలను గాజు మెటీరియల్లో దూర్చేసింది. వీటిని తయారు చేయడానికి వివిధ ప్రాంతాల్లోని పేద మహిళలను ఎంచుకున్నది అమృత. ఇటు జీవనోపాధిని అందిస్తూనే, ప్రకృతినీ పర్యావరణాన్నీ కూడా కాపాడుతున్నది. వీటికి ఆన్‌లైన్‌ ద్వారా దేశవ్యాప్తంగా అమ్మకాలు ఉన్నాయి. జ్యువెలరీకే పరిమితం కాకుండా, గృహాలంకరణ సామగ్రిని కూడా తయారు చేస్తున్నది అమృత. ఇవన్నీ కూడా పర్యావరణ హితమైనవే! 


VIDEOS

logo