ఆరుపదుల్లో..అదిరిపోయే ఆదాయం

ఆమె వయసు అరవై రెండు. ఆత్మవిశ్వాసం, పట్టుదల మాత్రం యువతరానికి తీసిపోదు. ఆమే గుజరాత్‌కి చెందిన నవాల్బెన్ చౌదరి. గత సంవత్సరం కరోనా కారణంగా ప్రజలంతా అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. కొందరు ఉద్యోగాలు కోల్పోతే, మరికొందరు వ్యాపారాల్లో తీవ్రంగా నష్టపోయారు. కానీ, నవాల్బెన్ మాత్రం పాడిపరిశ్రమ ద్వారా కోటి రూపాయలు సంపాదించి ఔరా అనిపించింది. తన పిల్లలు బాగా చదువుకుని పెద్దపెద్ద ఉద్యోగాల్లో స్థిరపడినా ఊరకే కూర్చోకుండా, శేష జీవితంలోనూ పదిమందికి ఉపాధి కల్పిస్తున్నది. అంతేకాదు, తన పిల్లలకంటే తన సంపాదనే ఎక్కువని మురిసిపోతున్నది. తన దగ్గరున్న కొన్ని గేదెలతో ఆమె చిన్న డెయిరీ ఫామ్ ప్రారంభించింది. ఆదాయం పెరిగేకొద్దీ దాన్ని విస్తరించింది. పాల అమ్మకం ద్వారా ఒక్క ఏడాదిలోనే కోటీ పది లక్షల రూపాయల ఆదాయం పొందింది. నవాల్బెన్ను రెండు లక్ష్మీ అవార్డులు, మూడు ఉత్తమ పాడి రైతు అవార్డులతో సత్కరించారు జిల్లా అధికారులు.
తాజావార్తలు
- రేపటి నుంచి మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
- న్యాక్ హైదరాబాద్‌కు సీఐడీసీ అవార్డు ప్రదానం
- ఆస్ట్రాజెనెకాను సస్పెండ్ చేసిన ఆస్ట్రియా ప్రభుత్వం
- తాగు నీటి ట్యాంక్‌కు టాయిలెట్ పైప్.. రైల్వేస్టేషన్ మాస్టర్ సస్పెండ్
- రోజూ పుచ్చకాయ తినడం మంచిదేనా
- అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన నటుడు దేవన్
- బంగారం రుణం: యోనోతో నో ప్రాసెసింగ్ ఫీజు
- అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్ రావు
- వాగుడు తగ్గించుకుని బుద్ధిగా ఉండాలి..లేదంటే,