శనివారం 27 ఫిబ్రవరి 2021
Zindagi - Jan 20, 2021 , 00:02:26

మిల్లెట్స్‌ టిక్కీ

మిల్లెట్స్‌ టిక్కీ

కావలసిన పదార్థాలు:

బంగాళా దుంపలు: మూడు, పచ్చిమిర్చి ముద్ద: 2 టేబుల్‌ స్పూన్లు, పెసలు: 2 టీ స్పూన్లు, రాజ్మా: 2 టీ స్పూన్లు, పచ్చి బఠాణీలు: 2 టీ స్పూన్లు, సెనగలు: 2 టేబుల్‌ స్పూన్లు, బొబ్బర్లు: 2 టేబుల్‌ స్పూన్లు, రాగి పిండి: టీ స్పూను, సజ్జ పిండి: టీ స్పూను, మొక్కజొన్న పిండి: 3 టీ స్పూన్లు, జొన్న పిండి: టీ స్పూను, అల్లం తురుము: టేబుల్‌ స్పూను, చాట్‌ మసాలా: 2 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తురుము: 2 టీ స్పూన్లు, నూనె: తగినంత.

తయారీ విధానం:

బంగాళ దుంపలను ఉడికించి పొట్టు తీసి మెదపాలి. పెసలు, సెనగలు, బొబ్బర్లు, రాజ్మా, పచ్చి బఠాణీలను ఉడికించి కచ్చాపచ్చాగా చిదమాలి. ఓ గిన్నెలో ఉడికించిన బంగాళదుంప ముద్ద, ఉడికించి మెదిపిన గింజల ముద్ద, రాగి, సజ్జ, జొన్నపిండి, పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, చాట్‌ మసాలా, తగినంత ఉప్పు, కార్న్‌ఫ్లోర్‌ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ముద్దలుగా చేసుకుని, ఒక్కో ముద్దనూ టిక్కీలా వత్తి , పెనంపై నూనె వేస్తూ రెండు వైపులా కాల్చుకుంటే సరి.  ఆరోగ్యకరమైన మిల్లెట్స్‌ టిక్కీలు రెడీ.


VIDEOS

logo