గురువారం 25 ఫిబ్రవరి 2021
Zindagi - Jan 20, 2021 , 00:02:26

యాడ్స్‌లోనూ ఆడ.. పిల్లే!

యాడ్స్‌లోనూ ఆడ.. పిల్లే!

వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించే లింగవివక్ష పిల్లల ఆలోచనా విధానంపైనా, ప్రవర్తనపైనా ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌-కోల్‌కతా పరిశోధకులైన రితూ మెహతా, అపూర్వ భరద్వాజ్‌ వివిధ మాధ్యమాల్లో ప్రసారమైన 81 ప్రకటనలను అధ్యయనం చేసి, వాటి ప్రభావం పిల్లలపై ఎలా పడుతున్నదో వివరించారు. మగపిల్లలే ఆడపిల్లల కంటే బలవంతులనీ, వారే అన్ని విషయాల్లో రాణిస్తున్నారనీ మెజారిటీ ప్రకటనల్లో చూపిస్తున్నారని తేల్చారు. ముఖ్యంగా 5-12 సంవత్సరాల పిల్లలు ఎక్కువగా చూసే పోగో, నిక్‌, హంగామా, డిస్నీ, కార్టూన్‌ నెట్‌వర్క్‌ వంటి చానెళ్ళలో ఈ ధోరణి ఎక్కువని విశ్లేషించారు. వంటల ప్రకటనల్లో ఆడవాళ్ళనూ; క్రీడలు, విద్య, ఉద్యోగం వంటి అంశాలకు సంబంధించిన ప్రకటనల్లో మగవాళ్ళనూ చూపించడం కూడా సరైంది కాదని సూచిస్తున్నారు. 


VIDEOS

logo