బుధవారం 03 మార్చి 2021
Zindagi - Jan 07, 2021 , 00:10:23

‘తొక్క’తో ఫ్యాషన్‌

‘తొక్క’తో ఫ్యాషన్‌

ఫ్యాషన్‌  ప్రపంచంలో కొత్తకొత్త ఆవిష్కరణలు మామూలే. అయితే, మన  మహిళా డిజైనర్లు మాత్రం విభిన్నమైన ట్రెండ్స్‌కు నాంది పలుకుతున్నారు. పండ్లూ కూరగాయల తొక్కలు, కాడలతో పాటు వ్యవసాయ వ్యర్థాలను ఫ్యాబ్రిక్‌ తయారీలో ఉపయోగిస్తున్నారు. 

  • బెంగళూరుకు చెందిన సయేషా సచ్‌దేవ్‌కు మొదట్నించీ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్‌ వాడటం అలవాటు. డిజైనింగ్‌ కోసమూ ఆ తరహా ఫ్యాబ్రిక్‌ కోసం వెతికింది. పలు పరిశోధనలు తర్వాత అరటిపండు తొక్క, గెల కాండాన్ని ఫ్యాబ్రిక్‌ తయారీకి వాడింది. అలాగే నారింజ తొక్క, తామరపువ్వు కాండాలు, గులాబీ రేకులు, అనాస పండు, కాఫీ గింజల వ్యర్థాలతో ఫ్యాబ్రిక్‌ తయారు చేస్తూ ఫ్యాషన్‌ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నది.  
  • ముంబయికి చెందిన మయూర అనే ఫ్యాషన్‌ డిజైనర్‌ సస్టెయినబుల్‌ ఫ్యాబ్రిక్‌ని ఎంకరేజ్‌ చేయడానికి.. చేప పొలుసుతో లగ్జరీ హ్యాండ్‌బ్యాగులు, పర్సులు, మొబైల్‌ ఫోన్‌ కవర్లు, ల్యాప్‌టాప్‌ కేసులు, ఐపాడ్‌ స్లీవ్స్‌ తయారు చేస్తున్నది. శాకాహారుల కోసం అవే వస్తువులను అనాసపండు ఆకులతో చేస్తున్నది. 
  • అహ్మదాబాద్‌కి చెందిన ఆల్ట్‌మ్యాట్‌ అనే కంపెనీ సీఈఓ షికా షా ఆలోచనలెప్పుడూ ఎకో ఫ్రెండ్లీ, ఫార్మర్‌ ఫ్రెండ్లీగా ఉంటాయి. అలా ఆమె తన కంపెనీలో అరటి పంటలోని వ్యర్థాలతో సరికొత్త ఫ్యాబ్రిక్‌ను తయారు చేస్తున్నది. ‘వ్యవసాయరంగ వ్యర్థాలను మేము రైతుల దగ్గర్నించి కొనుగోలు చేస్తున్నాం. దీనివల్ల రైతులకు ఎంతోకొంత ఆదాయం పెరిగిందని భావిస్తున్నాం. అలాగే, వ్యర్థాలను రీసైకిల్‌ చేయడం వల్ల పర్యావరణానికి హాని కూడా తగ్గింద’ని చెబుతున్నది షా.

VIDEOS

logo