ఆదివారం 07 మార్చి 2021
Zindagi - Jan 07, 2021 , 00:10:23

పాలు పెంచు.. బిడ్డకు పంచు!

పాలు పెంచు.. బిడ్డకు పంచు!

బిడ్డకు మొదటి ఆరునెలలపాటు తల్లిపాలే ఆహారం. కానీ, చాలామంది పాలు సరిగ్గా రావట్లేదని పోతపాలు పోస్తుంటారు. అయితే, ఎంత ఖరీదైన పాలపొడి అయినా తల్లిపాలకు సాటిరాదు. అందువల్ల బిడ్డకు తల్లిపాలు సరిపోకపోతే, పాల ఉత్పత్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. 

  • మెంతుల్లో పాలను పెంచే గుణం ఎక్కువ. చనుబాలకు చిక్కదనంతో పాటు ఔషధ గుణాలనూ అందిస్తాయి. వీటిలో పుష్కలంగా ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ బిడ్డ మెదడు ఎదుగుదలకు దోహదం చేస్తాయి. మెంతి ఆకుల్లో బీటా కెరోటిన్‌, విటమిన్‌-బి, ఐరన్‌, క్యాల్షియం అపారం. 
  • వెల్లుల్లి తల్లిపాలు పెంచేందుకు ఎంతగానే తోడ్పడుతుంది. తల్లీబిడ్డల రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. వీటితో పాల రుచీ వాసనా మారుతుంది కాబట్టి, మరీ ఎక్కువగా తీసుకోవద్దు.
  • ఆకుకూరలు కూడా పాల ఉత్పత్తిని పెంచుతాయి. వీటిలో పుష్కలంగా ఉండే ఐరన్‌, క్యాల్షియం, ఫొలేట్‌ పదార్థాలు తల్లికి, బిడ్డకి మంచి చేస్తాయి. ఆకుకూరలను తక్కువ మోతాదులోనైనా రోజుకో పూట తప్పక తీసుకోవాలి.
  • నువ్వులను తింటే పాలు బాగా పడుతాయని పెద్దలు చెప్పే పాత మాటే. ఇందులోని క్యాల్షియం బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అంతేకాదు, కాన్పు తర్వాత తల్లికి కూడా క్యాల్షియం అవసరం. నువ్వులతో లడ్డూలు చేసుకుని రోజుకు రెండు తినొచ్చు. కూరల్లోనూ వాడుకోవచ్చు.

VIDEOS

logo