ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Zindagi - Jan 07, 2021 , 00:10:23

చిటికెలో.. ‘చిలుకలు’

చిటికెలో.. ‘చిలుకలు’

ఒకప్పుడు సంక్రాంతి సీజన్‌ వచ్చిందంటే చాలు మార్కెట్లలో రంగురంగుల పంచదార చిలుకలు రాశులుగా పోసి అమ్మేవారు. అంతగా కాకున్నా.. ప్రయత్నిస్తే ఇప్పుడూ దొరుకుతున్నాయి. వాటి కోసం వెతుకులాటకు చెక్‌ పెట్టేయండి. ఇప్పుడు పంచదార చిలుకలను ఇంట్లోనే చిటికెలో చేసుకోవచ్చు. వీటిని రూపొందించే అచ్చులు ఆన్‌లైన్‌ అంగట్లో రకరకాల ఆకృతుల్లో దొరుకుతున్నాయి. చెక్కతో చేసినవి, ప్లాస్టిక్‌ అచ్చులు తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. పూలు, పండ్లు, హంసలు, గుమ్మటాలు ఇలా వివిధ ఆకృతుల్లో దర్శనమిస్తున్నాయి. నచ్చిన వాటిని ఎంచుకొని, ఇలా ఆర్డర్‌ ఇవ్వగానే అలా గడప ముందుకు వచ్చేస్తున్నాయి. చక్కెర పాకం పట్టి అచ్చుల్లో పోసి కాసేపు ఆరనిస్తే సరి. పాకానికి ఫుడ్‌ కలర్స్‌ జోడిస్తే రంగురంగుల పంచదార చిలుకలు సిద్ధం.VIDEOS

logo