గురువారం 04 మార్చి 2021
Zindagi - Dec 25, 2020 , 01:39:32

ఒకే సమయంలో చేయండి!

ఒకే సమయంలో చేయండి!

శారీరక దృఢత్వంపై యువత మక్కువ కనబరుస్తున్నది. ఫిట్‌గా, స్లిమ్‌గా ఉండేందుకు చేయని కసరత్తులు  లేవు. బరువు తగ్గించుకునేందుకు చేయని ప్రయత్నాలూ ఉండవు. అయితే,  సమయపాలన కూడా శరీర బరువును తగ్గిస్తుందని చెప్తున్నారు నిపుణులు. 

అదెలా అంటారా? వ్యాయామం చేయడమే కాదు.. ఆ వ్యాయామం ఒకే ప్రాంతంలో.. ఒకే సమయానికి చేస్తే సత్ఫలితాలను ఇస్తుందనేది వారి అభిప్రాయం. దీనిపై పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. ‘ఒబెసిటీ జర్నల్‌'లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. రోజూ కనీసం 30 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేస్తే శరీరం దృఢంగా మారుతుంది. అది కూడా రోజూ ఒకే సమయానికి చేయడం వల్ల ఫిజికల్‌ యాక్టివిటీ లెవెల్స్‌ పెరిగిపోయి ఒంటి బరువు ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ అధ్యయనం కోసం 375 మంది వయోజనులను పరిశీలించారు. వీరిలో 68% మంది ఒకేచోట, ఒకే సమయానికి వ్యాయామం చేసి అదనపు బరువును తేలికగా వదిలించుకున్నట్టు గుర్తించారు. యువత కచ్చితంగా వారానికి 350 నిమిషాలు వ్యాయామం చేయాలని ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా  సిఫార్సు చేస్తున్నారు. 

VIDEOS

logo