శనివారం 23 జనవరి 2021
Zindagi - Dec 12, 2020 , 00:06:28

గుమ్మడి కట్లెట్‌

గుమ్మడి కట్లెట్‌

‌కావాల్సినవి

గుమ్మడికాయ తురుము: ఒకటిన్నర కప్పు, ఉల్లిగడ్డ తరుగు: పావు కప్పు, కొత్తిమీర తరుగు : ఒక టేబుల్‌ స్పూన్‌, ఉప్పు: తగినంత, కారం: రుచికి సరిపడా, వాము: అర టీ స్పూన్‌, గరం మసాలా: పావు టీ స్పూన్‌, చాట్‌ మసాలా: పావు టీ స్పూన్‌ (కావాలనుకుంటే), బియ్యప్పిండి: రెండు టేబుల్‌ స్పూన్లు, శనగపిండి: పావు కప్పు, నూనె: సరిపడా

తయారీ విధానం

ముందుగా గుమ్మడికాయ తురుము కొద్దికొద్దిగా తీసుకుని, రసాన్ని గట్టిగా పిండాలి. రసాన్ని పక్కనబెట్టి తురుమును పెద్ద గిన్నెలో వేయాలి. అందులోనే ఉల్లిగడ్డ, కొత్తిమీర తరుగు, బియ్యప్పిండి, శనగపిండి, ఉప్పు, కారం, వాము, గరం మసాలా, చాట్‌ మసాలా వేసి కలపాలి. కావాలంటే తురుమును పిండితే వచ్చిన రసాన్ని వేసి కలుపుకోవచ్చు. ఆపైన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని కట్లెట్‌ ఆకారంలో వత్తాలి. చివరగా వాటన్నింటినీ నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి. లేదంటే నూనె చల్లుతూ పెనంపై ఇరువైపులా కాల్చుకోవచ్చు. వీటిని టమాటా చట్నీ లేదా సాస్‌తో నంజుకుంటే టేస్టీగా ఉంటాయి. 


logo