బాలీవుడ్లో దీపికా పడుకోన్, దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీలది విజయవంతమైన కాంబినేషన్‌గా అభివర్ణిస్తారు. . వీరిద్దరి కలయికలో రూపొందిన ‘రామ్‌లీలా’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలు పెద్ద విజయాల్ని సాధించాయి. తాజాగా సంజయ్‌లీలా భన్సాలీతో నాలుగో సినిమా చేయబోతున్నది దీపికా పడుకోన్. ‘బైజు బావ్రా’ పేరుతో రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో దీపికా పడుకోన్ బందిపోటు దొంగల రాణిగా నటించబోతున్నట్లు సమాచారం. మొఘలుల సామ్రాజ్య కాలం నాటి కథతో ఓ సంగీతకారుడికి, బందిపోటు దొంగల ముఠా నాయకురాలికి మధ్య జరిగే ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలిసింది. ప్రతీకారంతో ముడిపడిన ఈ కథలో దీపికా పడుకోన్ పాత్ర విభిన్నంగా ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది జూన్‌లో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్‌భట్ దర్శకత్వంలో 1952లో రూపొందిన ‘బైజు బావ్రా’ కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.