మెండు ద్రాక్ష

ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపేవారు, తీసుకునే ఆహారంపైనా అంతే శ్రద్ధ వహించాలి. సహజమైన యాంటీ ఆక్సిడెంట్లు, పుష్కలమైన ఖనిజాలు కలిగిన పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాంటివాటిలో నల్లని ఎండుద్రాక్ష ముఖ్యమైంది. రక్తాన్ని శుద్ధి చేయడం మొదలుకొని జుట్టు పెరుగుదలను ప్రేరేపించడం దాకా మన ఆరోగ్యాన్ని ఇది అనేక రకాలుగా కాపాడుతుంది.
రక్త శుద్ధికి
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే నల్లని ఎండుద్రాక్షలను తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్తంలోని టాక్సిన్లు, ఇతర వ్యర్థాలను బయటకు పంపించేస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తహీనత కూడా తగ్గిపోతుంది. ఇందులో అధికంగా ఉండే ఐరన్ హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది.
ఎముకలు బలంగా..
నల్లని ఎండు ద్రాక్షల్లో పొటాషియం, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చడంతోపాటు పగుళ్లను నివారిస్తాయి. వృద్ధాప్యంలో వచ్చే ‘బోలు ఎముక’లాంటి వ్యాధులబారి నుంచి రక్షిస్తాయి.
జట్టు పెరుగుదలలో..
విటమిన్ -సి అధికంగా ఉండే నల్లని ఎండుద్రాక్షలు తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇది కుదుళ్లను ఉత్తేజ పరిచి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు తెల్లబడ కుండా నియంత్రిస్తుంది.
దంతాలకూ
దంతాల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఎండు ద్రాక్షలు బాగా పనిచేస్తాయి. ఇందులోని పైటోకెమికల్స్ దంత క్షయాన్ని నివారిస్తాయి. చిగుళ్ల సమస్యలనుంచీ కాపాడుతాయి.
తాజావార్తలు
- మెరుగుపడుతున్న శశికళ ఆరోగ్యం..!
- ఓటు నమోదు చేసుకోండి : మంత్రి కేటీఆర్
- భారత్‌లో లాక్డౌన్.. మరింత సంపన్నులుగా మారిన కోటీశ్వరులు
- మలయాళ రీమేక్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్
- హద్దు మీరిన చైనా సైనికులు.. తిప్పి కొట్టిన భారత జవాన్లు
- ఇండియాలో మోడెర్నా ట్రయల్స్.. టాటాతో భాగస్వామ్యం
- సరికొత్త పనిలో సెక్స్ వర్కర్లు.. మార్కెట్లో మంచి గిరాకీ
- కొత్తగా లక్ష కోట్లతో నేషనల్ బ్యాంక్
- టీఎన్జీవో క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
- ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్