శనివారం 23 జనవరి 2021
Zindagi - Dec 03, 2020 , 00:04:45

బ్రకోలి-65

బ్రకోలి-65

  • ఇమ్యూనిటీ ఫుడ్‌

కావాల్సిన పదార్థాలు

బ్రకోలి : 3 కప్పులు (చిన్నగా కట్‌ చేసుకోవాలి), అల్లం వెల్లుల్లి ముద్ద : ఒక టేబుల్‌ స్పూన్‌, కారం : ఒక టేబుల్‌ స్పూన్‌,  కశ్మీరీ చిల్లీ పౌడర్‌ : ఒక టేబుల్‌ స్పూన్‌,  బియ్యం పిండి : అర కప్పు, మైదా : పావు కప్పు, మక్కజొన్న పిండి : రెండు టేబుల్‌ స్పూన్లు, బేకింగ్‌ సోడా : పావు టేబుల్‌ స్పూన్‌, నిమ్మరసం : ఒక టేబుల్‌ స్పూన్‌, ఉప్పు : రుచికి సరిపడా, నీళ్లు : అవసరమైనంత, నూనె : వేయించడానికి సరిపడా.

తయారు చేసే విధానం

ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని, అందులో తరిగిన బ్రకోలి ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించుకోవాలి. తర్వాత బ్రకోలిని వేరే గిన్నెలోకి తీసుకొని, పైన చెప్పిన పదార్థాలన్నిటినీ అందులో వేసుకోవాలి. బ్రకోలి ముక్కలకు ఆయా పదార్థాలన్నీ పట్టేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూకుడులో నూనెను వేడి చేసుకొని, బ్రకోలి ముక్కలు బంగారు వర్ణంలోకి మారేదాకా వేయించుకోవాలి. అంతే, వేడివేడి బ్రకోలి-65 సిద్ధం. దీనిని సాయంత్రం స్నాక్‌గా టమాటా సాస్‌తో తీసుకుంటే ఎంతో బాగుంటుంది. ఆరోగ్యకరం కూడా. బ్రకోలి అనేక పోషకాలకు నిలయం. logo