కాపురంలో కలతలా?

మూడో వ్యక్తి జోక్యం లేకుండా, ఒకరు చెప్పకుండా సంసారం సాఫీగా సాగిపోయే మార్గం భార్యాభర్తల చేతుల్లోనే, చేతల్లోనే ఉంటుంది. జీవితంలో చిరాకులు, మనస్పర్థలు తొంగిచూడకుండా ఉండాలంటే ఇదిగో దంపతులిద్దరూ ఈ నాలుగు సూత్రాలూ పాటించి చూడండి.
1. క్షమాపణ: ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చిన వేళ, అలకలప్పుడు.. రెండక్షరాల అస్త్రం సంధిస్తే ఇల్లు ఇల్లులాగే ఉంటుంది. శ్రీమతి బహుమతిగా కనిపిస్తుంది. శ్రీవారు శ్రీరాముడనిపిస్తారు. ఆ అస్త్రమే సారీ! ఒక్కసారి ఒక్క సారీ చెప్పినంత మాత్రాన తరిగిపోయేదేమీ ఉండదు. కానీ, ఈ చిన్న మాట భాగస్వామి కోపాన్ని దూదిపింజలా ఎగిరిపోయేలా చేస్తుంది.
2. కృతజ్ఞత: సారీలు చెప్పడానికి మొహమాటపడితే థ్యాంక్స్ చెప్పండి. ఎవరికెవరు సాయం చేసుకున్నా.. ‘బాధ్యత కాబట్టి చేశార’ని భావించకుండా.. థ్యాంక్స్ అంటూ కృతజ్ఞత వ్యక్తం చేయండి. ఆ రోజంతా ఆల్ హ్యాపీసే!
3. మర్యాద: సంసారం సాగరాన్ని భార్యాభర్తలిద్దరూ కలిసి సమంగా ఈదాలి. ఇలా జరగాలంటే ఒకరికొకరు మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలి. ఎవరి మర్యాదకు భంగం వాటిల్లినా.. ఆ సంసారం దుఃఖ సాగరం అవుతుంది.
4. సమభాగం: దాంపత్య జీవితంలో ఇద్దరూ సమానమే. నేను ఎక్కువ, నువ్వు తక్కువ అన్న పేచీ మొదలైందా.. ఒకరి దృష్టిలో మరొకరు దిగజారి పోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఎదురవ్వొద్దనుకుంటే.. ఇద్దరం చెరి సగమనే భావన మనస్ఫూర్తిగా కలగాలి.
తాజావార్తలు
- నాలా ప్రహరీ నిర్మాణానికి రూ. 68 కోట్లు
- టీకా వచ్చిందిగా ఢోకా లేదిక
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం
- నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!
- ఆరోగ్యానికి లైవ్ చేపలే మేలు
- వ్యాక్సిన్‌పై భయం వద్దు
- నంబర్ప్లేట్లు లేని వాహనాలకు జరిమానా
- విడుతల వారీగా అందరికీ వ్యాక్సిన్