గురువారం 03 డిసెంబర్ 2020
Zindagi - Nov 20, 2020 , 23:20:50

కంద అట్లు

కంద అట్లు

కావాల్సినవి

కందగడ్డ: మీడియం సైజు ఒకటి

పెసరపప్పు: ఒక కప్పు

బియ్యం: పావుకప్పు

అల్లం: చిన్న ముక్క

పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర: కొద్దిగా

కరివేపాకు: రెండు రెబ్బలు

జీలకర్ర: అర టీస్పూన్‌

ఉప్పు: తగినంత, నూనె: తగినంత

తయారుచేసే విధానం 

పెసరపప్పు, బియ్యం మూడు గంటలు నానబెట్టుకోవాలి. కందగడ్డను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. నానబెట్టిన బియ్యం, పెసరపప్పును మిక్సీలో దోశ పిండిలా రుబ్బుకోవాలి. పిండి రుబ్బుతున్నప్పుడే కంద ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర వేసి అన్నీ మెదిగేలా బాగా రుబ్బుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని పిండిని బాగా కలపాలి. పెనం మీద కొద్దిగా నూనె వేసుకొని.. ఈ పిండితో అట్టు వేసి దోరగా కాల్చుకోవాలి.