శనివారం 16 జనవరి 2021
Zindagi - Nov 05, 2020 , 00:14:57

గ్లిజరిన్‌తో చర్మ సంరక్షణ

గ్లిజరిన్‌తో చర్మ సంరక్షణ

చలికాలం వచ్చేసింది. చర్మ సంరక్షణ కోసం ఏవేవో మాయిశ్చరైజర్లు వాడుతుంటారు. అయితే అవేవీ ఇవ్వలేని ఫలితాన్ని గ్లిజరిన్‌ ఇస్తుందని అంటున్నారు బ్యుటీషియన్లు. ఎందుకంటే..  గ్లిజరిన్‌ విషపూరితం కాదు. ఏ విధమైన వాసన, రంగు  ఉండవు. ఇది సహజమైంది. చర్మం తేమ కోల్పోవడాన్ని నివారిస్తుంది. బయట నుంచి తేమను గ్రహిస్తుంది. పొడి, పొలుసు చర్మంతో బాధపడుతున్నవారు దీనిని వాడితే కొద్దిరోజులకే సమస్య పరిష్కారం అవుతుంది. గ్లిజరిన్‌ చాలా చవకైంది. దురద నివారణకు కూడా ఉపయోగపడుతుంది. చర్మంపై ముడుతలతో, వయసు ఎక్కువగా కనిపిస్తే ఇది చక్కటి పరిష్కారం. అలర్జీతో బాధపడేవారు క్రీములు, లోషన్లకు బదులుగా వాడితే మంచి ఫలితం ఉంటుంది.