శుక్రవారం 04 డిసెంబర్ 2020
Zindagi - Oct 31, 2020 , 01:53:30

వార్తల్లో మహిళ

వార్తల్లో మహిళ

అందాల తార కాజల్‌ అగర్వాల్‌ పెండ్లి పీటలెక్కింది. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్‌ కిచ్లుతో కాజల్‌ వివాహం జరిగింది. పదమూడేండ్ల సినీ కెరీర్‌లో ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించిన కాజల్‌ తెలుగులో ‘లక్ష్మీ కల్యాణం’తో ఎంట్రీ ఇచ్చింది.  ‘చందమామ’ సినిమా ద్వారా నటిగా మంచి గుర్తింపు పొందింది. ‘మగధీర’ ఆమెకు  టర్నింగ్‌ పాయింట్‌. ఆ సినిమా తర్వాత బాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ మంచి అవకాశాలు రావడంతో బిజీగా మారిపోయింది. మాస్‌ మీడియాలో గ్రాడ్యుయేషన్‌ చేసిన కాజల్‌ ‘లోరెల్‌' గ్రూప్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసి మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. వాస్తవానికి ఎంబీఏ చదవాలన్నది తన లక్ష్యం. కానీ అనూహ్యంగా మాస్‌ మీడియా వైపు మళ్లి మోడలింగ్‌, సినిమా రంగాల్లో అరంగేట్రం చేసింది. ముంబైకి చెందిన వినయ్‌ అగర్వాల్‌, సుమన్‌ అగర్వాల్‌ ఆమె తల్లిదండ్రులు. ఇండస్ట్రీలో ఎవరితోనూ  క్లోజ్‌గా ఉండని కాజల్‌.. తమన్నా భాటియాతో మాత్రం సన్నిహితంగా ఉంటుంది. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో కాజల్‌ కొత్త జీవితాన్ని ప్రారంభించింది.