శనివారం 16 జనవరి 2021
Zindagi - Oct 31, 2020 , 01:53:30

పర్యాటక కేంద్రాలు ఆడవాళ్లకు మాత్రమే!

పర్యాటక కేంద్రాలు ఆడవాళ్లకు మాత్రమే!

లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలిపోయాయి. పర్యాటక కేంద్రాలు రారమ్మంటూ ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. నేషనల్‌ పార్కులు సైతం సఫారీకి వేళయిందని ఆహ్వానం పలుకుతున్నాయి. విహారానికి సిద్ధమవుతున్నారా! తగు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి. పైగా ఒంటరిగా విహారానికి వెళ్తున్నట్టయితే మరింత జాగ్రత్త అవసరం. మహిళా యాత్రికుల కోసం వండర్‌ వుమానియా సంస్థ ప్రత్యేక కార్యాచరణతో సిద్ధంగా ఉన్నది. ఇందులో సభ్యులుగా చేరితే చాలు.. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లిపోవచ్చు. కావాల్సిన ప్రదేశానికి కులాసాగా చేరిపోవచ్చు. ఈ సంస్థ నిర్వహించే టూర్లన్నీ మహిళలకే ప్రత్యేకం. సోలో జర్నీలకూ చేయూతనిస్తుంది. బృందవిహారాలకు తగిన ఏర్పాట్లు చేస్తుంది. సాహస యాత్రలకు సరైన దిశా నిర్దేశం చేస్తుంది. చేయాల్సిందల్లా వండర్‌ వుమానియా (www.wanderwomaniya.com) వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్‌ కావడమే! కొత్త స్నేహితులతో కలిసి కొంగొత్త యాత్రలు చేసేయొచ్చు.