మంగళవారం 01 డిసెంబర్ 2020
Zindagi - Oct 29, 2020 , 23:40:46

అతి త్వరలో..అద్భుతమైన ప్రాజెక్ట్‌!

అతి త్వరలో..అద్భుతమైన ప్రాజెక్ట్‌!

రానా.. భల్లాలదేవుడిలా ఆగ్రహంగా కనిపిస్తాడు. ‘లీడర్‌'గా ప్రశాంతంగా ఉంటాడు. ‘ఘాజీ’ సైనికుడిలా ఆలోచిస్తాడు. త్వరలో ఓటీటీ వేదికగా అలరిస్తానని చెబుతున్న ఈ యంగ్‌ హీరో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న ముచ్చట్లు..

  • కరోనా అందరి కండ్ల్లూ తెరిపించింది. అన్ని రంగాల వారికీ ఇదో కనువిప్పు. అందరికీ ఏదో ఒకటి నేర్పించింది. యానిమేషన్‌ చేస్తానని నేనస్సలు అనుకోలేదు. కొవిడ్‌ కారణంగానే అది సాధ్యమైంది.
  • చాలామంది ‘లాక్‌డౌన్‌ టైమ్‌లో పెండ్లి చేసుకున్నావెందుకు?’ అంటున్నారు. నాకైతే హ్యాపీగా ఉంది. నా పెండ్లి సందడిని వర్చువల్‌ రియాలిటీ ద్వారా ఎంజాయ్‌ చేశారనే అనుకుంటున్నా. 
  • ఇండస్ట్రీకొచ్చి పదేండ్లయిపోయింది. త్వరలోనే ఓటీటీ వేదికపైనా కనిపిస్తా! నాకూ చాలా ఆసక్తిగా ఉంది. సినిమా రెండున్నర గంటల్లో పూర్తవుతుంది. కానీ, వెబ్‌సిరీస్‌ల విషయంలో మరింత స్కోప్‌ ఉంటుందనుకుంటున్నా! 
  • కరోనా టైమ్‌లో ‘అమర్‌ చిత్ర కథ’ యాప్‌ బాగా క్లిక్‌ అయి ఆదరణ పెరుగుతున్నది. 
  • ఒక సినిమా ఒప్పుకొంటే.. ఎందుకు చేస్తున్నాం? ఆ కథ ద్వారా ఏం చెబుతున్నాం? ఈ రెండు ప్రశ్నలు వేసుకుంటా. సంతృప్తికరమైన సమాధానం వస్తేనే ముందుకువస్తాను. 
  • ‘హాథీ మేరీ సాథీ’, ‘విరాటపర్వం’.. ఈ రెండు చిత్రాలు ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయా అని ఎదురుచూస్తున్నాను. విభిన్న కథాంశాలు, ఉన్నతమైన విలువలతో కూడిన ఈ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంగా చెప్పగలను. 

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో కదలికలు మొదలయ్యాయి.షూటింగ్‌లు స్టార్ట్‌ చేశారు. కొన్ని టీమ్‌లు విదేశాలకూ వెళ్తున్నాయి. మొత్తానికి ఇది మంచి పరిణామం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు థియేటర్లకు వచ్చి  సినిమాలు చూస్తారని అప్పుడే చెప్పలేం. చూద్దాం ఏం జరుగుతుందో?