బుధవారం 25 నవంబర్ 2020
Zindagi - Oct 29, 2020 , 23:40:43

కేక్‌.. ఆంత్రప్రెన్యూర్‌!

కేక్‌.. ఆంత్రప్రెన్యూర్‌!

వయసు చిన్నది. కానీ ఆలోచన పెద్దది. ఓ సరదా సంఘటన ఆమెను ఆంత్రప్రెన్యూర్‌గా మార్చింది. టీనేజ్‌లోనే సక్సెస్‌ సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నది వినూష. 

వినూష చెన్నైలోని అమృత విద్యాలయంలో చదువుతున్నది. ఆరోజు వినూష వాళ్లమ్మ బర్త్‌డే. తల్లిని సర్‌ప్రైజ్‌ చేయాలనే ఆలోచనతో ఒక కేక్‌ తయారుచేసింది. అది చూసిన తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అంతలోనే, ‘ఇలాంటివి చేస్తూ కూర్చుంటే.. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. మళ్లీ చేయొద్దు’ అని హెచ్చరించారు. రెండేండ్ల తర్వాత మరోసారి కేక్‌ తయారుచేసింది. ఇంట్లోవాళ్లకు మాత్రం బయట ఆర్డర్‌ చేసినట్లు చెప్పింది. రుచి అద్భుతంగా కుదిరింది. ‘ఎక్కడ ఆర్డర్‌ చేశావ్‌. చాలా బాగుంది’ అని పేరెంట్స్‌ గుచ్చిగుచ్చి అడిగితే.. తానే చేసినట్లు అంగీకరించింది. ఆ మేకింగ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టింది. దానికి విశేష స్పందన లభించింది. చాలామంది తమకూ కావాలని కోరారు. వెంటనే, తయారు చేసి డెలివరీ చేసింది వినూష. ఇలా ఆర్నెల్లలోనే మంచి ఆదరణ లభించింది. ‘ఫోర్‌ సీజన్‌ పేస్ట్రీ’ పేరుతో ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. మంచి ప్రాడక్ట్‌ ఇస్తుండటంతో చెన్నైలో పాపులర్‌ ఆంత్రప్రెన్యూర్‌గా మారిపోయింది వినూష.