శుక్రవారం 04 డిసెంబర్ 2020
Zindagi - Oct 29, 2020 , 00:07:29

ఖాదీ ఫుట్‌వేర్‌.. ట్రెండ్‌ గురూ!

ఖాదీ ఫుట్‌వేర్‌.. ట్రెండ్‌ గురూ!

ఖాదీ ధరిస్తే లుక్కే మారిపోతుంది. హుందాతనం వస్తుంది. ఇప్పటివరకూ ఖాదీ వస్ర్తాల్నే చూశాం. ఇప్పుడు.. ఖాదీ ఫ్యాబ్రిక్‌తో ఫుట్‌వేర్‌ కూడా వచ్చాయి. రకరకాల రంగుల్లో.. డిజైన్లలో.. 

ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. 

ఇదే తొలిసారా?  

భారతీయ వస్త్ర రంగంలో ఖాదీది ప్రముఖ స్థానం. ఖాదీతో ఇప్పుడు పాదరక్షలు వచ్చేశాయి. ఇండియాలోనే తొలిసారిగా ఢిల్లీలో ఖాదీ ఫ్యాబ్రిక్‌ ఫుట్‌వేర్‌ని లాంచ్‌ చేశారు. దీంతో ఫ్యాషన్‌ సర్కిల్స్‌లో ఇదొక ట్రెండ్‌గా నిలుస్తున్నది. ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం దొరకడంతో ఈ ఫుట్‌వేర్‌ కు మార్కెట్‌లో గుర్తింపు లభిస్తున్నది. 

ఎన్ని డిజైన్లు? 

పురుషులకు 15 డిజైన్లలో, స్త్రీలకు పది డిజైన్లలో  రూపొందించారు. గుజరాత్‌ పటోలా సిల్క్‌, బెనారస్‌ సిల్క్‌, మధుబని ప్రింటెడ్‌ సిల్క్‌, ఖాదీ డెనిమ్‌, తుస్సార్‌ సిల్క్‌, మట్కా కతియా సిల్క్‌, వెరైటీ కాటన్‌ ఫ్యాబ్రిక్‌, ఉన్ని వంటి మేలిరకం వస్ర్తాలనూ ఉపయోగించారు. 

ఎక్కడ కొనొచ్చు? 

అన్ని ఖాదీ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయి. డిజైనింగ్‌, ప్రింటెడ్‌ కలర్స్‌లో లభించే ఈ ఫుట్‌వేర్‌ను పార్టీలకు, శుభకార్యాలకు వేసుకోవచ్చు. ఫార్మల్‌, క్యాజువల్‌, ఫెస్టివ్‌..  అన్ని అకేషన్లలో వాడవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంచారు. www.khadiindia.gov.inలో ఆర్డర్‌ చేసుకోవచ్చు. 

ఖాదీయే ఎందుకు? 

ఖాదీకి ఇండియన్‌ ఫ్యాబ్రిక్‌గా బ్రాండ్‌ ఇమేజ్‌ ఉన్నది. ఖాదీ వస్త్రం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. పైగా తక్కువ ధరకు లభిస్తుంది. పెద్దరికానికి గుర్తుగా భావిస్తుంటారు. ప్రజల నుంచి లభిస్తున్న ఈ ఆదరణను గ్రహించి ఖాదీ, విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌ (కేవీఐసీ) ఈ కొత్తరకం ఫుట్‌వేర్‌ను తయారు చేసింది.