బుధవారం 25 నవంబర్ 2020
Zindagi - Oct 29, 2020 , 00:07:29

బరువు తగ్గడం తేలికే!

బరువు తగ్గడం తేలికే!

అల్పాహారం మహారాజులాగా తినాలి, మధ్యాహ్న భోజనం యువరాజులా... రాత్రికి బంటులా తినాలి అనే మాటలో గొప్ప ఆరోగ్యసూత్రం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇందుకోసం అధికబరువు ఉన్న 93 మంది మహిళలను ఎన్నుకొన్నారు. వారిని రెండు బృందాలుగా విభజించారు. మొదటి బృందంలోని మహిళలకు... రోజుకు 1,400 కెలోరీల ఆహారాన్ని అందించారు. ఇందులో 700 కెలోరీలు అల్పాహారంలో, 500 కెలోరీలు మధ్యాహ్న భోజనంలో, మిగిలిన 200 కెలోరీలు రాత్రిపూట ఆహారంలో అందేలా చూశారు. ఇక రెండో బృందంలోని మహిళలకు ఉదయం తక్కువ కెలోరీలు, రాత్రిపూట ఎక్కువ కెలోరీలు ఉండే ఆహారాన్ని అందించారు. పన్నెండు వారాలు గడిచిన తర్వాత చూస్తే... అల్పాహారంలో ఎక్కువ కెలోరీలను తీసుకున్న మహిళలు కాస్త ఎక్కువ బరువు తగ్గడమే కాకుండా, వారి నడుము కూడా మరింత సన్నబడిందట. రాత్రిపూట మన జీవక్రియలు మందగిస్తాయి కాబట్టి, అందుకు తగినట్టు తక్కువ ఆహారం సరిపోతుందనేది ఈ శాస్త్రవేత్తల భావన. ‘జర్నల్‌ ఒబెసిటీ’ అనే పత్రికలో దీనిని ప్రచురించారు.