బుధవారం 02 డిసెంబర్ 2020
Zindagi - Oct 28, 2020 , 00:24:39

వార్తల్లో మహిళ

వార్తల్లో మహిళ

అగ్రరాజ్యం మరోసారి జాతివివక్షతో వార్తల్లోకెక్కింది. ఈసారి బాధితులు భారతీయులే! వారు ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా భార్యాబిడ్డలే. ఆయన కుమార్తె అనన్య బిర్లా ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ఆ ట్వీట్ల ప్రకారం... తల్లి నీరజ్‌ బిర్లా, తమ్ముడు ఆర్యమాన్‌తో కలిసి వాషింగ్టన్‌లోని ‘స్కోపా’ అనే రెస్టారెంట్‌కి వెళ్లారామె. అక్కడ మూడుగంటల పాటు వేచి ఉన్నా, ఆర్డర్‌ రాకపోగా... గట్టిగా అడిగితే రెస్టారెంట్‌ నుంచి గెంటేసినట్లు చెప్పారు. అమర్యాదకు కారణం జాతివివక్షే అని కుండబద్దలు కొట్టేశారు. గాయనిగా, వ్యాపారవేత్తగా తనదైన గుర్తింపు ఉన్న అనన్యకు జరిగిన ఈ అన్యాయం వివాదాస్పదమవుతున్నది. ఇంత జరిగినా, సదరు రెస్టారెంట్‌ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడం గమనార్హం.