ఆదివారం 29 నవంబర్ 2020
Zindagi - Oct 25, 2020 , 00:57:11

సకల సిద్ధిధాత్రి

సకల సిద్ధిధాత్రి

ధ్యానం : సిద్ధ గంధర్వ యక్షాద్యైరసురైరమరైరపిసేవ్యమానా సదా భూయాత్సిద్ధిదా సిద్ధిదాయినీ॥

అష్టమి నాడు మహాగౌరిగా కనిపించే అమ్మవారు మహర్నవమి రోజు సిద్ధిధాత్రిగా దర్శనమిస్తుంది. కమలంపై పద్మాసనంలో కూర్చొని, ఒక చేతిలో కమలం ధరించి కరుణామృత ధారలను కురిపిస్తుంటుంది. ఈమె వాహనం సింహం. సకల అభీష్టాలనూ నెరవేర్చే దేవత ఈమె. సాక్షాత్తూ శివుడికే సర్వసిద్ధులను ప్రసాదించిన దేవత సిద్ధిధాత్రి. ఈ తల్లిని కొలిచిన వారికి అష్టసిద్ధులు కలుగుతాయి. లౌకిక, అలౌకిక సిద్ధులూ సిద్ధిస్తాయి. ఇహ సుఖాలను ఇస్తూనే జ్ఞానాన్నీ, మోక్షాన్నీ అనుగ్రహిస్తుందీ దేవత.

నైవేద్యం: ఆశ్వీయుజ శుద్ధ నవమి రోజు సిద్ధిధాత్రిగా అమ్మవారిని అలంకరించి అర్చనలు చేస్తారు. పాయసాన్నం నైవేద్యంగా పెడతారు. మధుర ఫలాలను భక్తితో నివేదిస్తారు.

కరోనాసుర మర్దిని