తప్పుడు స్నేహం..

అనగనగా.. ఒక అడవిలో ఓ పిచ్చుక ఉండేది. అది ఎలాంటి కల్మషమూ లేనిది. అన్ని పక్షులతో, జంతువులతో స్నేహం చేసేది. ఈ క్రమంలో దానికి ఓ రోజు కాకుల గుంపు పరిచయం అయింది. ఆ కాకులతో పిచ్చుకకు స్నేహం ఏర్పడింది. కొన్ని రోజుల కలిసి తిరిగాయి. ‘కాకులు మంచివి కావు’ అని మిగతా పక్షులు పిచ్చుకకు చెప్పాయి. అయినా వినకుండా పిచ్చుక ఆ కాకులను నమ్మసాగింది. ఒక రోజు కాకుల గుంపు అడవికి శివారులో ఉన్న ఒక తోటకు వెళ్తున్నాయి. అదే సమయంలో పిచ్చుక కనిపించింది. దీంతో పిచ్చుకనూ తమతో రమ్మన్నాయి. అమాయకపు పిచ్చుక ఎక్కడికి, ఎందుకు అని కూడా అడగలేదు. కాకుల వెంట బయల్దేరింది. అలా కొంత దూరం ప్రయాణించాయి. గ్రామంలోని ఓ పొలంలో కాకులు వాలాయి. పక్కనే ఉన్న ఒడ్డు మీద పిచ్చుక వాలింది. పొలంలో కాకులు తమకు కావాల్సిన ధాన్యపు గింజలను పెకిలించుకొని తింటున్నాయి. పిచ్చుకకు ఏం చేయాలో తెలియక అటూ ఇటూ తిరగసాగింది. అంతలోనే పొలం యజమాని వచ్చాడు. గుంపులు గుంపులుగా పొలంలో ఉన్న కాకులను చూసి తీవ్ర కోపానికి గురయ్యాడు. చేతిలోని కర్రను బలంగా కాకుల వైపు విసిరాడు. అది గమనించిన కాకులు హుటాహుటిన ఎగిరిపోయాయి. రైతు విసిరిన కర్ర సరాసరి పిచ్చుకకు వచ్చి తాకింది. దీంతో పిచ్చుక కూలబడి, రైతుకు దొరికింది. ‘బాబోయ్! నా తప్పేమీ లేదు. నేను అమాయకురాలిని, నన్ను వదిలేయండి!’ అని ప్రాధేయపడింది. కానీ పంట నాశనం కావడంతో రైతు కోపం మీద ఉన్నాడు. పిచ్చుక మాట నమ్మలేదు సరి కదా, మరో రెండు దెబ్బలు వేశాడు.
నీతి: దుష్టులతో స్నేహం మనకే నష్టం.
తాజావార్తలు
- సీ మ్యాట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
- ట్రక్కు, జీపు ఢీ.. ఎనిమిది మంది మృతి
- సింగరేణి ఓసీపీ-2లో ‘సాలార్' చిత్రీకరణ
- ఆల్‌టైం హైకి పెట్రోల్, డీజిల్ ధరలు
- రాష్ర్టంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- ముస్లిం మహిళ కోడె మొక్కు
- ముగియనున్న ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ దరఖాస్తు గడువు
- వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..