వనపర్తి: జిల్లాలోని కొత్తకోటలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కనిమెట్ట వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు.. లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి