బుధవారం 25 నవంబర్ 2020
Zindagi - Oct 22, 2020 , 23:29:25

వెన్నముద్ద బతుకమ్మ

వెన్నముద్ద బతుకమ్మ

పండుగ చివరికి వచ్చేసరికి బతుకమ్మ కోలాహలం మరింత పెరుగుతుంది. దసరాకు ఆహ్వానం పలుకుతూ బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలుకుతుంటారు. “గోల్కొండ పట్నం పోదామా.. గొలుసుల గొళ్లెము తెత్తామా! ఎవ్వరి మెళ్లో వేత్తామా! చిన్ని కృష్ణుడి మెడలో వేత్తామా” అని పరిహాసాలు చేస్తూ ఒక్కొక్కరి పేరుతో పాటలు పాడుతారు. ఆ చిన్ని కృష్ణుడికి వెన్నముద్దలన్నా, పాల పదార్థాలన్నా చాలా ఇష్టం. అందుకని వెన్నె, పాలకోవా బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. దుర్గమ్మను సరస్వతీ దేవిగా భావించి ఆ చల్లనిదేవికి.. అంతే తెల్లని పాల నుంచి ఉత్పత్తి చేసిన పదార్థాలను నివేదించడం, తెల్లని పూలతో అర్చనలు చేయడం ఆచారంగా వస్తున్నది. ఆరోగ్యాన్నిచ్చే ఈ ప్రసాదాన్ని అందరూ ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందాల్ని పంచుకుంటారు.

- డా॥ ఆర్‌.కమల