బుధవారం 21 అక్టోబర్ 2020
Zindagi - Oct 18, 2020 , 23:29:53

చల్లని తల్లి చంద్రఘంట

చల్లని తల్లి చంద్రఘంట

చంద్రఘంట.. అమృత భరితమైన నిత్యానంద రసాపానం, చంద్రకాంతి సుధాపానం చేయడం ద్వారా ఒక అపూర్వ అంశ రూపొందింది. ఆ అద్భుత రూపమే చంద్రఘంట అవతారం. శిరస్సున చంద్రుడిని ధరించి తన బిడ్డలపై చల్లని వెన్నెల కురిపిస్తుందీ తల్లి. స్వచ్ఛమైన తెల్లని రూపంతో శాంతిని ఉద్బోధిస్తుంది. సకల సంతోషాలు ప్రశాంతతలోనే ఉన్నాయని సందేశాత్మకంగా వివరిస్తుందీ రూపం. భక్తితో  ఆరాధించే వారికి తన చల్లని కరుణామృత దృక్కులతో శాంతి సౌభాగ్యాలు ప్రసాదిస్తుంది.

ధ్యానం : ‘పిండజ పరవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా , ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా’

నైవేద్యం : ఆశ్వీయుజ శుద్ధ తదియ రోజు చంద్రఘంటా రూపంలో అమ్మవారిని స్వచ్ఛమైన, పవిత్రమైన మనసుతో ఆరాధిస్తారు. కొబ్బరి అన్నం, పాయసం  నివేదనగా సమర్పించాలి.


logo