శుక్రవారం 23 అక్టోబర్ 2020
Zindagi - Oct 17, 2020 , 01:18:54

కొత్తవారి కోసం..

కొత్తవారి కోసం..

సుధామూర్తి... ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అర్ధాంగి అన్నది ఒక పార్శం మాత్రమే. ఉపాధ్యాయురాలిగా, రచయిత్రిగా, సమాజ సేవకురాలిగా తనకు అరుదైన గుర్తింపు ఉంది. అందుకే 1996లో ‘ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌' నెలకొల్పినప్పుడు, ఆ బాధ్యతలను సుధామూర్తికే అప్పగించారు. నిరాశ్రయుల కోసం వేలాది ఇండ్లు, అక్షరాస్యత కోసం లెక్కలేనన్ని గ్రంథాలయాలు... ఇలా అరుదైన కార్యక్రమాలెన్నో ఫౌండేషన్‌ చేపట్టింది. కొవిడ్‌ సమయంలోనూ వంద కోట్ల విలువైన సాయాన్ని అందించింది. ఆ సంస్థ మార్గదర్శిగా సుధామూర్తికి అంతులేని పురస్కారాలు లభించాయి. కానీ క్రమశిక్షణనూ, ప్రణాళికలనూ కచ్చితంగా పాటించే సుధామూర్తి... తన పదవిలో ఎల్లకాలం ఉండిపోదల్చుకోలేదు. 2021 నాటికి తను ఫౌండేషన్‌ బాధ్యతలు చేపట్టి 25 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆ సమయంలో పదవి నుంచి విరమించుకుంటానని ప్రకటించారు సుధామూర్తి. ఫౌండేషన్‌ నుంచి వైదొలగినా, సేవా కార్యక్రమాల్లో మాత్రం తన దూకుడు తగ్గేది లేదని స్పష్టం చేశారు. 


logo